శ్రీవారి ఆలయంలో భక్తుల ప్రవేశంపై టీటీడీ ఈఓ వివరణ..
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల ప్రవేశంపై టీటీడీ ఈఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. జూన్ 30 వ తేది వరకు శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు సోషియల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల ప్రవేశంపై టీటీడీ ఈఓ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. జూన్ 30 వ తేది వరకు శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు సోషియల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంతమని వివరించారు. మే 3వ తేది తరువాత పరిస్థితులకనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం, లాక్ డౌన్ అనంతరం ఉన్నపళంగా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించలేమని తెలిపారు. పద్మావతి పరిణయోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని వివరించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాక తేదిని నిర్ణయించి పద్మావతి పరిణయోత్సవాన్ని నిర్వహిస్తామని స్పష్టంచేశారు.
Also Read: కోవిద్-19: 100 కోట్ల మందికి సోకే ప్రమాదం.. భయపెడుతున్న రిపోర్ట్..