కోవిద్-19: 100 కోట్ల మందికి సోకే ప్రమాదం.. భయపెడుతున్న రిపోర్ట్..
కోవిద్-19 మహమ్మారి విల తాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే.. ది ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ (IRC)... ఇదో సహాయ గ్రూప్. తాజాగా ఓ రిపోర్టు రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా

కోవిద్-19 మహమ్మారి విల తాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే.. ది ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ (IRC)… ఇదో సహాయ గ్రూప్. తాజాగా ఓ రిపోర్టు రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా 100 కోట్ల మందికి సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. IRC ఏమంటోందంటే… పేద, ఇతర దేశాలపై ఆధారపడే దేశాలకు తగిన సాయం చెయ్యకపోతే… ఆ దేశాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందని తన రిపోర్టులో తెలిపింది. ఇక్కడ పేద దేశాలంటే… ఆఫ్రికాలోని దేశాలతోపాటూ… ఆప్ఘనిస్థాన్, సిరియా లాంటి దేశాలన్నమాట.
మరోవైపు.. ఈ దేశాల్లో జనాభా సంఖ్య ఎక్కువ. పేదలు ఎక్కువ. సంపన్న దేశాలతో పోల్చితే పరిశుభ్రత చాలా తక్కువ. ఇక కాలుష్యం, ఆకలి బాధలు, కరవు సమస్యలు ఎప్పుడూ ఉండేవే. అందువల్ల ఈ దేశాల్లో కరోనా అంత త్వరగా వదలదనీ, వీటిని ఆర్థికంగా ఆదుకోకపోతే… 100 కోట్ల మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని IRC రిపోర్ట్ చెప్పినట్లుగా… BBC తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), లండన్‌లోని ఇంపెరియల్ కాలేజీ డేటాను క్రోఢీకరించి… IRC తన రిపోర్టును తయారుచేసింది.
కాగా.. ప్రస్తుతం రోజూ 60 వేల నుంచి 70 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటాన్ని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించింది. కరోనా చాలా ఎక్కువ మందికే ఉన్నా… టెస్టుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల వాస్తవ లెక్కలు బయటకు రావట్లేదని అంటోంది. చాలా సంపన్న దేశాల్లో టెస్టులు పెరిగేకొద్దీ కేసుల సంఖ్య కూడా పెరగడాన్ని ఉదాహరణగా చెబుతోంది.