ఢిల్లీలో కోవిడ్ ఉధృతి పెరగకుండా చర్యలు.. రవాణా వ్యవస్థలో పరిమితులు విధిస్తూ ఆదేశాలు
దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరగడంతో.. దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరగకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు...
Delhi – Covid restrictions: దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరగడంతో.. దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరగకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ మేరకు రెండు వారాల పాటు వెయిట్ వాచ్ పద్ధతిని అనుసరించడంతోపాటు.. ప్రజా రవాణా వ్యవస్థలో పరిమితులు విధిస్తూ డీడీఎంఏ (ఢిల్లీ డిజాస్టర్ మెనేజ్‌మెంట్ అథారిటీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విపత్తు శాఖ అధికారులు సోమవారం కరోనా కేసుల ఉధృతిపై సమీక్షించారు. ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. రెండు వారాల పాటు బస్సులు, మెట్రోలో పరిమిత సంఖ్యలో ప్రయాణికులకు అనుమతివ్వాలని డీడీఎంఏ నిర్ణయం తీసుకుంది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఎలాంటి ఆంక్షలు విధించడం లేదని అధికారులు వెల్లడించారు.
లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అధ్యక్షతన జరగిన డీడీఎంఏ సమావేశంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ తదితరులు హాజరయ్యారు. మెట్రో నగరమైన ఢిల్లీలో కరోనా ఉధృతి పెరిగితే చేపట్టవలసిన చర్యలపై చర్చించారు.
Also Read: