India Mars Mission: మార్స్ మీద ఎందకంత మమకారం..? మనల్ని మనం అన్వేషించుకోవడానికేనా…!

మార్స్.. దీన్నే మనం అంగారక గ్రహమని, అరుణగ్రహమని పిల్చుకుంటున్నాం.. అనాదిగా అరుణ గ్రహంపై మనకు ఓ ప్రత్యేకమైన ఉత్సుకత. అరుణకాంతితో మెరిసే ఆ గ్రహంపై అంతులేని ఆసక్తి...

India Mars Mission: మార్స్ మీద ఎందకంత మమకారం..? మనల్ని మనం అన్వేషించుకోవడానికేనా...!
Follow us
Pardhasaradhi Peri

| Edited By: Ravi Kiran

Updated on: Feb 25, 2021 | 1:53 PM

India Mars Mission:మార్స్.. దీన్నే మనం అంగారక గ్రహమని, అరుణగ్రహమని పిల్చుకుంటున్నాం.. అనాదిగా అరుణ గ్రహంపై మనకు ఓ ప్రత్యేకమైన ఉత్సుకత. అరుణకాంతితో మెరిసే ఆ గ్రహంపై అంతులేని ఆసక్తి ఎందుకూ అంటే అనేక ప్రశ్నలు వాటితో పాటే అనేక సమాధానాలు మన ముందుకొస్తాయి. తాజాగా నాసా ప్రయోగించిన పర్సీవరెన్స్‌ రోవర్‌ తో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.. (ఈ వ్యాసం కొన్ని వాస్తవాలు..మరికొన్ని శాస్త్రవేత్తల మధ్య సాగుతున్న సంఘర్షణలతో కూడిన ఊహాగానాలతో కూడుకుంది.) మనం నివసించే ఈ భూమి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు అంతమవ్వాల్సిందే.. ఆ పరిస్థితే వస్తే మనం నివసించడానికి మరో ప్రత్యామ్నాయ గ్రహం కావాలి కదా! సరిగ్గా ఈ ఆలోచిన నుంచే అరుణ గ్రహం మీద ప్రత్యేక దృష్టి సారించారన్నది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. భూమికి దగ్గరగా ఉండడం..దాదాపుగా భూమిని పోలిన వాతావరణం ఉండడం…గతంలో ఎప్పుడో అక్కడ జీవం ఉన్నది అనడానికి ఆనవాళ్ళు ఉన్నాయన్న సంకేతాలు ఇలాంటి అనేక అంశాలే మార్స్ ఆ ప్రత్యామ్నాయం అన్న నిర్ధారణకి రావడానికి కారణం అన్న వాదన కూడా ఉంది. ఇప్పటికే అనేక రోవర్లు మార్స్ మీద చక్కర్లు కొట్టి జీవజాలానికి సంబంధించిన అనేక ఆనవాళ్ళు పంపాయి. పాత్ ఫైండర్, ఫోనిక్స్, వీకింగ్ 1, 2. ఆపర్చునిటీ, క్యూరియాసిటీ, స్పిరిట్..తాజాగా పర్సీవరెన్స్. ఇప్పటి వరకూ పంపిన రోవర్ల కంటే తాజాగా పంపిన పర్సీవరెన్స్ ఎంతో భిన్నమైంది. గతంలో పంపిన రోవర్లు నిర్ణీత కాల వ్యవధిలో మార్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోల తో పాటు అక్కడ నేల మీద ఉన్నఅనేక రకాల ఖనిజాలకు సంబంధించిన వివరాల్ని(డేటా) భూమికి పంపేవి. అవి మార్స్ మీద ప్రయాణించే క్రమంలో కొండలు, గుట్టలు, లోయలు లాంటివి దాటడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ తాజాగా పంపిన పర్సీవరెన్స్ లో ఒక డ్రోన్ లాంటి పరికరం ఉంది..ఉదాహరణకి ఒక కొండ లాంటి ప్రాంతాన్ని రోవర్ ఎక్కాల్సిన పరిస్ధితి వస్తే, పర్సీవరెన్స్ కిందనే ఉండి తన తో ఉండే డ్రోన్ ని పైకి పంపించి ఎత్తయిన ఆ ప్రాంతం నుంచి సమాచారాన్ని సేకరించి మళ్ళీ తిరిగి రోవర్ మీదకు వచ్చి చేరడం ద్వారా ఆ డేటాని పర్సీవరెన్స్ కి తద్వారా అది భూమికి చేరడానికి సులువైన మార్గం ఉంది. అంతే కాదు పర్సీవరెన్స్ మార్స్ మీద నుంచి అనేక రకాల శాంపిల్స్ ని సేకరించి వాటిని తీసుకుని స్వయంగా భూమికి తీసుకు రావాల్సి ఉంది. అది కూడా మిషన్ పర్సీవరెన్స్ లో ఒక కీలక ఘట్టం. అదే కనుక జరిగితే మార్స్ ఉపరితలాన్ని, మార్స్ లోపల ఉన్న ఖనిజాల లాంటి మూలకాల గురించి స్వయంగా మన శాస్త్రవేత్తలు పరిశోధించడానికి అవకాశం ఉంటుంది. మార్స్ మీద ఇప్పటికే విపరీతమైన రేడియేషన్ ఉందని దాని వల్లే అక్కడ సముద్రాలు, నీరు, జీవజాలం అంతరించిపోయాయని శాస్త్రవేత్తల విశ్వాసం. ఈ వాదనలో కూడా ఎంత నిజం ఉందో కూడా పర్సీవరెన్స్ భూమి మీదకు తీసుకువచ్చే శాంపిల్స్ ని అధ్యయనం చేయడం ద్వారా ఒక స్పష్టతకు వచ్చే వీలుంది.ఇదంతా ఇప్పటి వరకూ జరుగుతున్న, జరగబోతున్న మార్స్ అధ్యయనానికి సంబంధించిన అంశాలు..అయితే ఇంతకీ మార్స్ మీద మనకెందుకంత ఉత్సుకత అనే విషయంలో ఒక భిన్నమైన వాదన కూడా ఉంది. ఎవరికైన సొంత ఊరి మీద మమకారం ఉండడం సహజమేకదా అన్నది ఈ థియరీ. మార్స్ మన సొంత ఊరా? మనది భూమి కదా..మార్స్ ఎలా అవుతుంది మన సొంత ఊరు అంటే…అవును అని సమాధానం చెప్పే శాస్త్రవేత్తలు చాలా మంది ఉంది ఉన్నారు. డార్విన్ జీవ పరిణామ క్రమ సిద్ధాంతం అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి పుస్తకాలలో చదువుకుంటూనే ఉన్నాం. ఏక కణ జీవి నుంచి మొదలైన మనిషి కోతి నుంచి ఎలా పరిణామం చెందుతూ వచ్చాడు అన్నది డార్విన్‌ థియరీ సారాంశం. పరిణామక్రమంలో కోతి నుంచి మనిషి ఎలా పరివర్తన ఉందాడు అన్నది డార్విన్ మహాశయిడు చెప్పిన సిద్ధాంతం. కానీ, ఈ ధియరీని మొదటి నుంచి వ్యతిరేకించే శాస్త్రవేత్తలు చాలా మందే ఉన్నారు. దాదాపు 3 కోట్ల జీవజాలాలకి ఈ భూమితో సంబంధం ఉంది. వీటి వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదు. భూమితో ప్రత్యక్షంగా పరోక్షంగా వీటన్నింటికీ విడదీయలేని అవినాభావన సంబంధం ఉంది కానీ ఒక్క మనిషి మాత్రమే ఈ భూమి మీద తేడా. మనిషి వల్లే భూమికి ముప్పు పొంచి ఉన్న మాట కూడా నిజం. ఎందుకంటే మనిషిది కాదు ఈ భూమి. మనిషి ఈ భూమికి ఏలియన్. అంటే ఇతర గ్రహాల నుంచి వచ్చి ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నాడు. కానీ, కొన్ని వేల సంవత్సరాల్లో ఎక్కడో మధ్యలో ఎక్కడో ఒక సారి దాదాపు మనిషి భూమి మీద అంతరించిపోయే పరిస్ధితి రావడం, తద్వారా తాను ఎక్కడ నుంచి ఇక్కడకు వచ్చాను అన్న ఆనవాళ్ళు లేకుండా పోవడం, మిగిలిన కొద్ది మంది ఆ పాత ఆధారాలను కోల్పోవడంతో లింక్ కట్ అయిపోయింది అన్నది ఒక వర్గం శాస్త్రవేత్తల విశ్వాసం. అయితే మనిషి వచ్చింది మార్స్ మీద నుంచేనని, త్వరలోనే ఈ ఆనవాళ్ళని స్పష్టంగా గుర్తించగలుగుతామని ప్రస్తుతం మార్స్ మీద తిరుగుతున్న రోవర్ల తరువాత స్వయంగా మనిషి మార్స్ మీదకు వెళ్ళేనాటికి, మార్స్ కి మనిషి కి ఉన్న సంబంధం తిరిగి కనుగొనగలుగుతామని ఈ శాస్త్రవేత్తల విశ్వాసం. అయితే దానికి ఖచ్చితంగా మనిషి మార్స్ మీద అడుగు పెట్టాలి. ఇప్పటి వరకూ భూమిని దాటిన మనిషి కేవలం చంద్రడు మీదకు మాత్రమే వెళ్ళగలిగాడు. వేరొక గ్రహానికి అవుటర్ స్పేస్ కో వెళ్ళిన పరిస్దితే లేదు. ప్రస్తుతం మన దేశం ప్రయోగించిన మిషన్ మంగళ్ (మంగళ్ యాన్) నుంచి మొదలు పెడితే నాసా ప్రయోగించిన అనేక రోవర్లు మార్స్ కి చేరడానికి 10 నెలల నుంచి 6 నెలల సమయం పడుతోంది. మనిషికి మార్స్ మీదకు పంపాలంటే రాను పోను ఏడాది సమయం పడుతుంది. ఇంతవరకూ మనిషి అంతరిక్షంలో అత్యధికంగా గడిపింది ఏడాది కాలం మాత్రమే. కానీ అవుటర్ స్పెస్ లోకి వెళితే ఉండే రేడియేషన్ ని తట్టుకుని నిలబడ్డ సందర్భం లేదు. మరో పెద్ద సమస్య స్పేస్ లోకి వెళ్ళి రావడం వల్ల ఉండే బోన్ లాస్‌. గ్రావిటీ నుంచి దూరంగా జరిగే కొద్దీ వ్యోమగాములకు ఉండే పెద్ద సమస్య ఇదే. అందుకోసమే మార్స్ మీదకు వెళ్ళి ప్రయోగాలు చేయాలంటే ప్రస్తుతం పడుతున్న 6 నెలల సమయాన్ని గణనీయంగా తగ్గించాలి. అంటే ప్రస్తుతం ఉపయోగించే ఇంధనం స్ధానంలో, న్యూక్లియర్ ఫ్యూజన్ ని తీసుకొని రాగలిగితే మాత్రమే స్పీడ్ ని ఎన్నో రెట్టు పెంచే అవకాశం ఉంది. అదే కనక జరిగితే మార్స్ మీదకు వెళ్ళే సమయం కూడా బాగా తగ్గిపోతుంది. అప్పుడు మాత్రమే మనిషి మార్స్ మీదకు స్వయంగా వెళ్ళి ప్రయోగం చేయగలుతాడు. దానికి సంబంధించిన పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అవి కనుక సక్సెస్ అయితే మనిషి తన మూలాల్ని మార్స్ మీద కనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో తెలీదు. కానీ, త్వరలోనే ఈ కలని నిజం చేసి మన పుట్టింటికి సంబంధించిన ఆనవాళ్ళని మనం కనిపెట్టాలని ఆహోరాత్రులు శ్రమిస్తున్న శాస్త్రవేత్తలందరికీ గుడ్ లక్… మురళీ కృష్ణ. ఎం.

సిక్స్‌ప్యాక్‌తో సర్ ప్రైజ్ ఇచ్చిన టాలీవుడ్ క్రేజీ హీరో..
సిక్స్‌ప్యాక్‌తో సర్ ప్రైజ్ ఇచ్చిన టాలీవుడ్ క్రేజీ హీరో..
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!