సంచలన నిర్ణయం తీసుకున్న రిలయన్స్… 100 శాతం నిర్వహణతో ఓటూసీ అనుబంధ సంస్థ..!

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) సంచలన నిర‍్ణయాన్ని ప్రకటించింది. తన ఆయిల్-టు-కెమికల్స్ (ఓటూసీ) వ్యాపారాన్ని స్వతంత్ర అనుబంధ సంస్థగా ప్రకటించింది.

  • Balaraju Goud
  • Publish Date - 12:26 pm, Tue, 23 February 21
సంచలన నిర్ణయం తీసుకున్న రిలయన్స్... 100 శాతం నిర్వహణతో ఓటూసీ అనుబంధ సంస్థ..!

Reliance Industries Limited : ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) సంచలన నిర‍్ణయాన్ని ప్రకటించింది. తన ఆయిల్-టు-కెమికల్స్ (ఓటూసీ) వ్యాపారాన్ని స్వతంత్ర అనుబంధ సంస్థగా రూపొందిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. వ్యాపార బదిలీతో కొత్తగా ఏర్పడిన ఈ అనుబంధ సంస్థపై 100 శాతం నిర్వహణ, నియంత్రణ కలిగి ఉంటుందని ఆర్‌ఐఎల్ తెలిపింది. మొత్తం అపరేటింగ్‌ టీం, కొత్త సంస్థలోకి మారుతుందని పేర్కొంది. అలాగే, ఆదాయాలను తగ్గించడం లేదా నగదు ప్రవాహాలపై ఎటువంటి పరిమితులు ఉండవని పేర్కొంది.

ఇకపై, ఈ కొత్త స్వతంత్ర అనుబంధ సంస్థపై 100 శాతం నిర్వహణ నియంత్రణను రిల్ పొందుతుందని తెలిపింది. ఎక్స్‌ఛేంజీలకు రిలయన్ ఇండస్ట్రీస్ ఓ నోటిఫికేషన్ పంపింది. ఓటూసీ వ్యాపారాన్ని స్వతంత్ర అనుబంధ సంస్థగా మార్చిన తర్వాత… అందులో… ప్రమోటర్ల గ్రూపు వాటాల్లో మార్పులేవీ ఉండవనీ… వారు 49.14 శాతం వాటా అలాగే కలిగి ఉంటారని స్పష్టం చేసింది.

ఈ కొత్త నిర్ణయం వల్ల… రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓటూసీ పరిధిలోని రిఫైనింగ్, మార్కెటింగ్, పెట్రో కెమికల్స్ ఆస్తులు… ఓటూసీ స్వతంత్ర అనుబంధ సంస్థకు బదిలీ అవుతాయి. దీంతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు వీలవుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ భావిస్తోంది. దీంతో సౌదీ అరామ్‌కో కంపెనీతో డీల్ కుదుర్చుకోవచ్చని అశిస్తోంది. పెట్టుబడి మూలధనాన్ని ఆకర్షించేందుకు ఈ నిర్ణయం ద్వారా వీలవుతుంది. ప్రస్తుతం అరామ్‌కో కంపెనీతో చర్చలు కొనసాగుతున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతి దారైన సౌదీ అరామ్‌కో… రిలయన్స్ ఓటూసీ వ్యాపారంలో 20 శాతం వాటా దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఈ కొత్త నిర్ణయంతో రిలయన్స్ ఓటూసీ వ్యాపారానికి సంబంధించి ఉన్న 25 బిలియన్ డాలర్ల వడ్డీతో చెల్లించే లోన్‌ను కూడా కొత్త సంస్థకు మళ్లిస్తుంది. ఏడాది కాలంలో ఎస్‌బీఐ – ఎంసీఎల్‌ఆర్ రేట్ ప్రకారం… లోన్‌పై వడ్డీని చెల్లిస్తోంది. వ్యూహాత్మక పెట్టుబడి దారులు పెట్టుబడి పెట్టినప్పుడు లోన్‌ మొత్తాన్ని చెల్లించనున్నారు. ఇక,ఈ మార్పుకి సంబంధించి… సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛైంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), స్టాక్ ఎక్స్‌ఛేంజీల నుంచి అనుమతిని కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ పొందింది.

అయితే… ఈక్విటీ షేర్ హోల్డర్స్, క్రెడిటర్స్, ఇన్‌కం టాక్స్ అథారిటీ, ముంబై, అహ్మదాబాద్‌లో బెంచ్‌లు ఉన్న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నుంచి గ్రీన్ సిగ్నల్ రావల్సి ఉంది. ఇలాంటి అనుమతులన్నీ సెప్టెంబర్ చివరి నాటికి వచ్చేస్తాయని కంపెనీ భావిస్తోంది.

ఈ కొత్త నిర్ణయం తర్వాత… రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాటా 85.1 శాతానికి చేరుకుంది. అలాగే, జియో ప్లాట్‌ఫామ్స్‌లో 67.3 శాతం ఉంటుంది. ఈ ప్రతిపాదిత కొత్త స్వతంత్ర అనుబంధ సంస్థ… ఫ్యూయల్ రిటైల్ సబ్సిడియరీని కూడా కలిగి ఉంటుంది. ఇందులో రిల్… 51 శాతం వాటా కలిగి ఉంది. మిగతా 49 శాతం బీపీ పీఎల్‌సీ సంస్థకు చెందింది. ఇకపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్… ఓటూసీ సబ్సిడియరీ సంస్థ కలిసి… 2035 నాటికి నెట్ కార్బన్ జీరో టార్గెట్‌ను చేరాలనుకుంటున్నాయి. ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

Read Also… కస్టమర్ల కోసం తన్నుకున్న పానీపూరి వ్యాపారులు.. ఇనుపరాడ్లతో కొట్లాట.. వైరల్ అవుతున్న వీడియో.!!