ఉత్తరాఖండ్ విషాదం, ఇంకా ఆచూకీ తెలియని 136 మంది, కొనసాగుతున్న సహాయక చర్యలు

ఉత్తరాఖండ్ లోని ఛమోలీ జిల్లాల్లో ఈ నెల 7 న సంభవించిన జల విలయం తాలూకు ఆనవాళ్లు ఇంకా చెరిగిపోలేదు. గ్లేసియర్ ఔట్ బరస్ట్, కొండ చరియలు విరిగిపడడం,

  • Umakanth Rao
  • Publish Date - 12:40 pm, Tue, 23 February 21
ఉత్తరాఖండ్ విషాదం, ఇంకా ఆచూకీ తెలియని 136 మంది, కొనసాగుతున్న సహాయక చర్యలు

136 missing after uttarakhand disaster:ఉత్తరాఖండ్ లోని ఛమోలీ జిల్లాల్లో ఈ నెల 7 న సంభవించిన జల విలయం తాలూకు ఆనవాళ్లు ఇంకా చెరిగిపోలేదు. గ్లేసియర్ ఔట్ బరస్ట్, కొండ చరియలు విరిగిపడడం, నదులకు వెల్లువెత్తిన వరదలతో ముఖ్యంగా ఈ జిల్లా కకావికలమైంది. 136 మంది జాడ ఇంకా తెలియడంలేదు.  వీరికోసం సహాయక బృందాలు ఇప్పటికీ గాలిస్తున్నాయి. ఇప్పటివరకు 60 కి పైగా మృతదేహాలను  స్వాధీనం చేసుకున్నారు. అలకానంద, దౌలీ గంగా నదులకు వచ్చిన మెరుపు వరదలతో ఓ జల విద్యుత్ కేంద్రం, 5 వంతెనలు కొట్టుకు పోగా, మరో పవర్ ప్రాజెక్టు తీవ్రంగా దెబ్బ తిన్నది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండో-టిబెటన్ ఫోర్స్, పోలీసు, పారామిలిటరీ బలగాలు ఇంకా గాలింపులు కొనసాగిస్తున్నాయి. గల్లంతయిన వారి డీ ఎన్ ఏ శాంపిల్స్ కోసం వారి కుటుంబాలను పిలిపిస్తున్నారు.

కాగా ఉత్తరాఖండ్ లో జరుగుతున్న అభివృధ్ది పనుల కారణంగా తరచూ ఈ రాష్ట్రం ప్రకృతి వైపరీత్యాలకు గురవుతోందన్న పర్యావరణ వేత్తల ఆందోళనను కేంద్రం తోసిపుచ్చింది. చార్ ధామ్ సమీపంలో ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులకు, గ్లేసియర్ ఔట్ బరస్ట్ కు సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

Read More :

ఇక ఓపెన్, క్రిమినల్ ప్రాసిక్యూటర్లకు ట్రంప్ టాక్స్ రికార్డులు, అమెరికా సుప్రీంకోర్టు అనుమతి