నెల్లూరు జిల్లాలో ముందుకొచ్చిన సముద్రం.. భయం గుప్పిట్లో స్థానికులు

ఫొని తుపాను ప్రభావం నెల్లూరు జిల్లాలో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. జిల్లాలో అనేక చోట్ల అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కోవూరు వంటి ప్రదేశాల్లో సముద్రం బాగా ముందుకు రావడంతో స్థానికుల్లో భయాందోళనలకు గురవుతున్నారు. నెల్లూరు జిల్లా తమిళనాడుకు దగ్గరగా ఉండడంతో ఫొని ప్రభావం ఈ జిల్లాపై గణనీయంగా ఉండే అవకాశం ఉండనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని నెల్లూరు జిల్లాకు సమీపంలోనే దిశ మార్చుకోనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, పోలీసులు, రెవెన్యూ అధికారులు కలెక్టర్ […]

నెల్లూరు జిల్లాలో ముందుకొచ్చిన సముద్రం.. భయం గుప్పిట్లో స్థానికులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 28, 2019 | 7:40 PM

ఫొని తుపాను ప్రభావం నెల్లూరు జిల్లాలో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. జిల్లాలో అనేక చోట్ల అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కోవూరు వంటి ప్రదేశాల్లో సముద్రం బాగా ముందుకు రావడంతో స్థానికుల్లో భయాందోళనలకు గురవుతున్నారు. నెల్లూరు జిల్లా తమిళనాడుకు దగ్గరగా ఉండడంతో ఫొని ప్రభావం ఈ జిల్లాపై గణనీయంగా ఉండే అవకాశం ఉండనుంది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని నెల్లూరు జిల్లాకు సమీపంలోనే దిశ మార్చుకోనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, పోలీసులు, రెవెన్యూ అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు ముంద జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.