AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలోని అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని తుపాను క్రమంగా బలపడుతోంది. ఇవాళ రాత్రికి అది తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ విభాగం పేర్కొంది. ప్రస్తుతం తుపాను మచిలీపట్నానికి 1,230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోంది. ఇది మరో 24 గంటల్లో పెనుతుపానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఏపీలోని అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు […]

ఏపీలోని అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 28, 2019 | 7:38 PM

Share

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫొని తుపాను క్రమంగా బలపడుతోంది. ఇవాళ రాత్రికి అది తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ విభాగం పేర్కొంది. ప్రస్తుతం తుపాను మచిలీపట్నానికి 1,230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోంది. ఇది మరో 24 గంటల్లో పెనుతుపానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఏపీలోని అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫొని తుపాను మే 3 వరకు బంగాళాఖాతంలోనే తీవ్ర తుపానుగా కొనసాగి ఆపై ఏపీ తీర సమీపానికి వస్తుందని, అనంతరం దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపు సాగిపోతుందని అంచనా వేస్తున్నారు.

Follow Us
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
ఆ జిల్లాకు త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
ఆ జిల్లాకు త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు
ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్
తిరుమలలో ఏడాదికోసారి మాత్రమే జరిగే మహోత్సవం.. జ్యేష్ఠాభిషేకం..
తిరుమలలో ఏడాదికోసారి మాత్రమే జరిగే మహోత్సవం.. జ్యేష్ఠాభిషేకం..
కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావకు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు!
కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావకు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు!
ఎలాన్ మస్క్ తర్వాత అతడే.. నెలకు రూ.645 కోట్ల జీతం
ఎలాన్ మస్క్ తర్వాత అతడే.. నెలకు రూ.645 కోట్ల జీతం
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే