కన్న పిల్లల కోసం తల్లి ఆరాటం..
తన కన్న పిల్లల కోసం ఆ తల్లి పడుతున్న ఆరాటం సగం ఫలించింది. అత్తింటి వేధింపులు భరించలేక మీడియా ముందుకొచ్చిన సింధు పోరాటం కొనసాగుతోంది. ఇద్దరు పిల్లల్ని అప్పగించాలంటున్న ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలకడంతో.. ఉదయం నుంచి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. సాయంత్రం వరకు కొనసాగిన నిరసన దీక్షకు అత్తింటి వారు దిగివచ్చారు. ఇద్దరు పిల్లల్లో చిన్నపాపను అప్పగించారు. పెద్దపాపను కాసేపు తనతో ఉండేందుకు కూడా అంగీకరించలేదని.. తన న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. […]
తన కన్న పిల్లల కోసం ఆ తల్లి పడుతున్న ఆరాటం సగం ఫలించింది. అత్తింటి వేధింపులు భరించలేక మీడియా ముందుకొచ్చిన సింధు పోరాటం కొనసాగుతోంది. ఇద్దరు పిల్లల్ని అప్పగించాలంటున్న ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలకడంతో.. ఉదయం నుంచి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. సాయంత్రం వరకు కొనసాగిన నిరసన దీక్షకు అత్తింటి వారు దిగివచ్చారు. ఇద్దరు పిల్లల్లో చిన్నపాపను అప్పగించారు. పెద్దపాపను కాసేపు తనతో ఉండేందుకు కూడా అంగీకరించలేదని.. తన న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఎన్నో కేసుల్లో న్యాయం చెప్పిన రిటైర్ట్ జస్టిస్ నూతి రామ్మోహన్ రావు, తన కోడలికి మాత్రం తీరని అన్యాయం చేస్తున్నాడని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. కట్నం తీసుకోవడం చట్టరిత్యా నేరమని సమాజాన్ని మేలు కొల్పాల్సిన ఆయన.. అదే కట్నం కోసం కొడుకు భార్యని చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్నాయి.
హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ నూతి రామ్మోహన్‌రావుపై కోడలు సింధూ శర్మ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం తన భర్త వశిష్ఠ, అత్త, మామ చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించింది. తనపై ఇంట్లో దాడి చేశారంటూ సింధూ కొన్ని ఫోటోలను కూడా బయటకు విడుదల చేసింద. ఆమె చేతికి మెడ మీద కొట్టిన గాయాలు ఫోటోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల వాతలు తేలిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అత్తమామతో పాటు, భర్త వశిష్ట తనపై దాడి చేశారని ఆ దాడికి సంబంధించిన గాయాలివే అంటూ సాక్షాలు చూపిస్తోంది.
కాగా, ఇప్పటికే రిటైర్డ్ జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు, అతని భార్యతో పాటు, సింధూ భర్త వశిష్టపైన సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 498ఏ, 406, 323 సెక్షన్లతో పాటు, డీపీ యాక్ట్ 4,6 సెక్షన్ల కింద కూడా సీసీఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
సింధు, వశిష్టకి ఏడేళ్ల క్రితం పెళ్లైంది. రెండేళ్ల క్రితం నుంచి ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. దీంతో సింధూ పుట్టింట్లో ఉంటోంది. అయితే విశిష్ఠతో పాటు, తన మామ నూతి రామ్మోహన్‌రావు, అత్త వచ్చి పుట్టింట్లోనే తనపై దాడి చేశారని.. తీవ్రంగా గాయపడిన తనను వాళ్లే అపోలో ఆస్పత్రిలో చేర్చారని తెలిపింది.