AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరణంలోనూ వీడని బంధం.. భార్య చనిపోయిన 24 గంటల్లోనే భర్త మృతి.. అసలు ఏం జరిగిందంటే?

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ భార్య మృతి చెందగా.. ఆమె మరణాన్ని తట్టుకోలేక మరుసటి రోజే భర్త కూడా మృతి చెందాడు. రెండు రోజుల వ్యవధిలోనే భార్య భర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

మరణంలోనూ వీడని బంధం.. భార్య చనిపోయిన 24 గంటల్లోనే భర్త మృతి.. అసలు ఏం జరిగిందంటే?
Couple Death Tragedy
Anand T
|

Updated on: Feb 14, 2026 | 11:20 AM

Share

భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె మరణించిన మరుసటి రోజే భర్త కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటన కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం మండల పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గం వినోద్‌ అనే వ్యక్తికి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం గురిజాల గ్రామానికి చెందిన సువర్ణ అనే యువతితో 2020లో వివాహం జరిగింది.

అయితే ఈ దంపతులు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అంతా హ్యాపీగా ఉందనే క్రమంలో భార్య సువర్ణకు ఆరోగ్యం క్షీణించింది. దీంతో గత కొన్నాళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. ఇటీవల ఆమె పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లతారు కుటుంబ సభ్యులు.. అయితే అక్కడే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సువర్ణ మృతి చెందింది.

ఇక సువర్ణ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.. అయితే అంత్యక్రియలు ముగించుకొని ఇంటికి రాగానే భర్త వినోద్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వినోద్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు నిర్ధారించారు.

24 గంటల వ్యవధిలోనే భార్య భర్తలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో కమ్మర్‌పల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర