స్టైల్‌గా ఉంటుందని, ట్రెండ్ కోసం క్రాక్స్ వాడుతున్నారా? పిల్లలకు ఎంత డేంజరో తెలుసా?
క్రోక్స్ చెప్పుల వాడకం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది, కానీ ఇవి మీ పాదాలకు, ముఖ్యంగా పిల్లలకు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదాలలో సహజంగా ఉండే వంపు (ఆర్చ్) అభివృద్ధికి క్రోక్స్ అడ్డుపడి, ఫ్లాట్‌ఫుట్ సమస్యకు దారితీస్తుంది. ఇది భవిష్యత్తులో మోకాలి నొప్పులు, ప్లాంటర్ ఫాసియాటిస్ వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.

ఈ మధ్యకాలంలో చాలామంది క్రాక్స్ లేదా క్రాక్స్ లాంటి డిజైన్ ఉన్న చెప్పులు వాడుతుండడం చూస్తూ ఉన్నాం. ఇటు ఎండలోనూ అటు వానలోను సౌకర్యవంతంగా ఉంటుందని ఈ క్రాక్స్ ని చాలామంది వాడుతున్నారు. యూత్ లో ఇదొక ట్రెండ్ గా కూడా మారింది. జీన్స్ అయినా ఫార్మల్ అయినా షార్ట్స్ అయినా దేని పైన వేసుకున్న ఈ క్రాక్స్ అలా సూట్ అయిపోతాయి.
అసలు క్రాక్స్ కనిపెట్టింది పడవల్లో వెళ్లి చేపలు పట్టే జాలర్ల కోసం. ఎప్పుడు తడిగా ఉండే బోట్స్ లో జారిపడకుండా ఉండేందుకు వీటిని ఉపయోగించేవాళ్ళు. ఆ తర్వాత యూరప్ యూత్ దీన్ని వరల్డ్ వైడ్ చేసి పడేసింది. సరే పెద్దవాళ్లు వేసుకోవడంలో పర్వాలేదు కానీ చిన్నపిల్లలకు కూడా తల్లిదండ్రులు క్రాక్స్ కొనివ్వడం, పిల్లలు కూడా వాటికి అలవాటు పడిపోయి క్రాక్స్ లాంటి చెప్పలే కావాలని అడగడం సహజంగా మారింది.
ఇంతవరకు బాగానే ఉన్నా క్రాక్స్ వల్ల మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు డాక్టర్స్. ఎలా అంటే చిన్నప్పుడే కాళ్లలో ఒక ఆర్చ్ ఆకారంలో వంపుగా పాదాలు పెరుగుతాయి. మడమ కింద ఈ ఆర్చ్ చిన్న వయసు నుంచే డెవలప్ అవుతుంది. ఇది సహజంగా మన బరువును ఆపేందుకు, కాళ్ల పైన ఒత్తిడి తగ్గించేందుకు ఉపయోగపడే విధానం. అయితే ఈ క్రాక్స్ వాడటం వల్ల ఆ ఆర్చ్ ఆకారంలో కి పాదాలు మారడం తగ్గుతుందని నిపుణులు గమనించారు. దీనివల్ల ఫ్లాట్ ఫుట్ ప్రాబ్లం వస్తుంది.
ఇది భవిష్యత్తులో అనేక రకాల కాళ్ల, మోకాళ్ళ సమస్యలకు కారణంగా మారుతుంది. దీనివల్ల వాకింగ్ స్టైల్ మారుతుంది, హీల్ పెయిన్ కూడా వస్తుంది. పాదాల కింద ఆనికాయలు కూడా ఏర్పడతాయి. ప్లాంట పేసైటిస్ అనే వ్యాధి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే క్రాక్స్ లాంటి డిజైన్ ఉన్న చెప్పుల బదులు సాఫ్ట్ మెటీరియల్ ఉన్న శాండిల్స్, లేదా ఆర్చ్ ఆకారంలో ఉండే షూస్ వాడడం బెటర్ అంటున్నారు డాక్టర్స్.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి




