Covid-19: కరోనా మరణ మృదంగం.. ఆ దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభం.. 5 లక్షలు దాటిన మరణాలు..
Coronavirus Deaths in Brazil: ప్రపంచవ్యాప్తంగా కరోనా భూతం అలజడి సృష్టిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. పలు దేశాల్లో కరోనా ఉధృతి తగ్గినప్పటికీ..
Coronavirus Deaths in Brazil: ప్రపంచవ్యాప్తంగా కరోనా భూతం అలజడి సృష్టిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. పలు దేశాల్లో కరోనా ఉధృతి తగ్గినప్పటికీ.. మరికొన్ని చోట్ల మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే.. కరోనా వైరస్ విజృంభణతో వణికిపోతోన్న బ్రెజిల్‌లో థర్డ్ వేవ్ సూచనలు కనిపిస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బ్రెజిల్‌లో కోనా మరణాల సంఖ్య 5లక్షలు దాటింది. మరణాల సంఖ్యలో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే.. బ్రెజిల్ ప్రజలు కరోనా నిబంధనలు పాటించకుండా వ్యవహరించడం, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మందకొడిగా సాగుతుండడంతో బ్రెజిల్ మరోముప్పు ఎదుర్కోవాల్సి రావొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి కాస్త తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. దక్షిణ అమెరికా దేశాలల్లో మాత్రం విజృంభిస్తోంది. ముఖ్యంగా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న బ్రెజిల్‌లో కరోనా వ్యాప్తి అదుపులోకి రావడంలేదని పలువురు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా బ్రెజిల్‌లో మూడో దశ విజృంభణ మొదలైందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 24 గంటల్లో దేశంలో 2,300 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5లక్షలు దాటింది. అయితే.. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పేర్కొంటున్నారు. బ్రెజిల్‌లో ప్రస్తుతం కఠిన కోవిడ్ ఆంక్షలు.. లేకపోవడంతో.. కరోనా ఉధృతి పెరుగుతోంది. బార్లు, రెస్టారెంట్లు సాధారణ స్థితికి చేరుకోవడం, షాపింగ్ సమయాల్లోనూ ప్రజలు మాస్కులు ధరించకుండా కనిపిస్తుండటంతో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: