China: చైనాలో 100 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ.. వెల్లడించిన డ్రాగన్

China COVID-19 vaccination: కరోనా విలయం అనంతరం తమ దేశంలో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ చేసినట్లు చైనా ఆదివారం ప్రకటించింది. మార్చిలో ప్రారంభించిన వ్యాక్సినేషన్‌

China: చైనాలో 100 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ.. వెల్లడించిన డ్రాగన్
Follow us
Shaik Madar Saheb

| Edited By: Subhash Goud

Updated on: Jun 21, 2021 | 6:51 AM

China COVID-19 vaccination: కరోనా విలయం అనంతరం తమ దేశంలో 100 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ చేసినట్లు చైనా ఆదివారం ప్రకటించింది. మార్చిలో ప్రారంభించిన వ్యాక్సినేషన్‌ శనివారానికి 100 కోట్లకు చేరుకుందని.. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో తమ దేశం మరో మైలు రాయిని అధిగమించిందని చైనా పేర్కొంది. అయితే చైనాలో ఎంత మందికి వ్యాక్సినేషన్‌ వేశారన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. చైనాలో గతేడాది నుంచి దాదాపు 21 వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో నిర్వహించాయి. అయితే నాలుగింటికి మాత్రమే అనుమతులు లభించాయి. అందులో సినోఫార్మ్, సినోవ్యాక్‌ అనే రెండు వ్యాక్సిన్లకు మాత్రమే అంతర్జాతీయ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు జారీ చేసింది. ఆ రెండు వ్యాక్సిన్లను చైనా పలు దేశాలకు సరఫరా సైతం చేసింది.

ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారికి చైనాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. 3 నుంచి 17 ఏళ్ల వారికి కూడా వ్యాక్సినేషన్‌ చేసేందుకు చైనా సిద్ధమవుతోంది. ప్రస్తుతం వివిధ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం.. టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. గత ఐదు రోజుల్లో ఏకంగా 100 మిలియన్ డోసుల పంపిణీ చేశామని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. కాగా..ఈ ఏడాది చివరి నాటికి దేశంలో కనీసం 70 శాతం మంది టీకా తీసుకుంటారని జాతీయ కమిషన్ డిప్యూటీ చీఫ్ జెంగ్ యిక్సిన్ తెలిపారు.

అయితే.. కరోనా కట్టడికి, పిల్లల వ్యాక్సినేషన్‌కు మరికొన్ని వ్యాక్సిన్లకు కూడా అత్యవసర అనుమతులు కూడా జారీ చేసింది. వీరికి వ్యాక్సినేషన్‌ చేసేందుకు పాలసీలను కూడా తయారు చేసే పనిలో చైనా నిమగ్నమైంది.

Also Read;

KK Shailaja: కేరళ మాజీ మంత్రి శైలజా టీచర్‌కు అంతర్జాతీయ అవార్డు.. ‘ఓపెన్‌ సొసైటీ ప్రైజ్‌’

బ్రిటన్ లో చివరి డైనోసార్ల మనుగడ ! బయట పడిన కాలి ముద్రల శిలాజాలు ! కొనసాగుతున్న పరిశోధనలు