కాలువలో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించిన పోలీస్…..అలీగఢ్ లో ఎస్ఐ సాహసం
అలీగఢ్ లో నిండుగా ప్రవహిస్తున్న నది లాంటి ఓ కెనాల్ లో పడి మునిగిపోతున్న వ్యక్తిని ఓ ఎస్ఐ తన ప్రాణాలకు తెగించి కాపాడారు.
అలీగఢ్ లో నిండుగా ప్రవహిస్తున్న నది లాంటి ఓ కెనాల్ లో పడి మునిగిపోతున్న వ్యక్తిని ఓ ఎస్ఐ తన ప్రాణాలకు తెగించి కాపాడారు. ఆశిష్ కుమార్ అనే ఈయన ఈ కాలువ ప్రాంతంలో డ్యూటీలో ఉండగా ఆ కాలువలో వ్యక్తి పడిపోవడం చూశారు. వెంటనే తానూ అందులో దూకి ఆ వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఒక చేత్తో ఆ వ్యక్తిని పట్టుకుని మరో చేత్తో ఈదుతూ ఆశిష్ కుమార్ ఈదుతూ రావడాన్ని పోలీసులు స్థానికులు చూశారు. ఆ ఎస్ఐ సాహసాన్ని అలీగఢ్ పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసించారు. తన చిన్నతనంలో ఈ ఎస్ఐ స్విమ్మింగ్ చేసేవాడని, ఆ తరువాత ఇన్నేళ్ళుగా స్విమ్ చేయలేదని తెలిసింది. కానీ ఇప్పుడాయన అజ్ఞాత వ్యక్తిని ఈ కాలువ నుంచి రక్షించడం విధి నిర్వహణ పట్ల ఆయన చిత్తశుద్డిని నిరూపిస్తోందని వారన్నారు. ఆయనకు 25 వేల రివార్డును బహుకరించారు.
కాగా ఎవరో ఈ వైనాన్ని తమ మొబైల్ లో రికార్డు చేశారు. ఆశిష్ కుమార్ ధైర్య సాహసాలను తోటి పోలీసులు స్థానికులు కూడా పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఆ పోలీస్ వినమ్రంగా వారి ప్రశంసలకు బదులిస్తూ.. ఆ క్షణంలో తనకు ఏం చేయాలో తోచలేదని.. ఆ మనిషి ప్రాణాలను కాపాడాలన్న ఉద్ద్దేశం తప్ప తాను మరేమీ ఆలోచించలేదని చెప్పారు.
“#अलीगढ़ #पुलिस के जांबाज सब इंस्पेक्टर आशीष-बचपन में तैराकी सीखी,उसके बाद कही सालों तक तैराकी नहीं की, लेकिन डूबते हुए की जान बचाने के लिए खाकी किस कदर समर्पित है यह दुनिया को दिखा दिया..” सब इंस्पेक्टर आशीष को प्रशस्ति पत्र एवं ₹25000 प्रोत्साहन राशि स्वीकृत की जाती है?? pic.twitter.com/Kzix1c6ofg
— Kalanidhi Naithani (I.P.S) (@ipsnaithani) June 20, 2021
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: వర్షం పడుతుండగా కూతురి ఆన్ లైన్ క్లాసుల కోసం గొడుగు పట్టుకుని నిలబడిన తండ్రి.. ( వీడియో )
Viral Video: కొబ్బరిబోండం తాగుతున్న రంగుల చిలక… నెటిజన్లు ఫిదా.. ( వీడియో )