AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలపై పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. పిల్లల్లో కరోనా లక్షణాలు ఏంటి.. వైద్యులేమంటున్నారు..?

Covid-19 Second Wave: కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. పిల్లలను సైతం వదిలి పెట్టడం లేదు. అధికంగా చిన్నారులపై కూడా దాడి చేస్తోంది. దీంతో...

పిల్లలపై పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. పిల్లల్లో కరోనా లక్షణాలు ఏంటి.. వైద్యులేమంటున్నారు..?
Covid 19
Subhash Goud
|

Updated on: Apr 26, 2021 | 1:25 PM

Share

Covid-19 Second Wave: కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. పిల్లలను సైతం వదిలి పెట్టడం లేదు. అధికంగా చిన్నారులపై కూడా దాడి చేస్తోంది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కరోనా సెకండ్‌వేవ్‌లో చిన్నారులు కూడా ఈ మహమ్మారి బారినపడటం ఆందోళన పెంచుతోంది. 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై ఎక్కువగా కరనా దాడి చేస్తోంది. 1-8 మధ్య వయసున్న వారిలో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఫస్ట్‌ వేవ్‌లో లక్షణాలు లేకుండా…

కాగా, గత ఏడాది కూడా పిల్లలకి కరోనా సోకినప్పటికీ వారిలో లక్షణాలు లేకపోవడంతో దానికి సంబంధించిన ఘటనలు పెద్దగా బయటకు రావడం లేదు. కరోనా వారికి ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు పోయిందో తెలిసే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది చిన్న పిల్లల్లో 1శాతం మందికి కరోనా సోకితే, ఈ సారి 1.2 శాతం మందికి సోకినట్లు చెబుతున్నారు. శాతాల్లో చూస్తే తక్కువగానే కనిపించినా.. ఇది చాలా ఎక్కువేనంటున్నారు. ప్రభ్వుత్వం పిల్లల్లో కరోనాకి సంబంధించి ఎలాంటి అధికారిక గణాంకాలు విడుదల చేయడం లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు.

డబుల్‌ మ్యూటెంట్‌ కారణమా..?

కరోనా సెకండ్‌వేవ్‌లో పిల్లలకు కరోనా సోకడానికి డబుల్‌ మ్యూటెంట్‌ కారణమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ వైరస్‌కు త్వరగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటుగా రోగనిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేసే సామర్థ్యం కూడా ఉంది. దీంతో పిల్లల్లో ఈ వైరస్‌ సులభంగా సోకుతోంది. కరోనా తగ్గిన తర్వాత రెండు నుంచి నాలుగు వారాల్లో వచ్చే ఎంఐఎస్‌సీ (మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌) వ్యాధితో అధిక మంది పిల్లలు తమ దగ్గరకు వస్తున్నట్లు కోల్‌కతాకు చెందిన పీడియాట్రిషన్‌ డాక్టర్ జయదేవ్‌ రే తెలిపారు. అంతేకాకుండా కోవిడ్‌ సోకిన పిల్లల్లో 40-50 శాతం మంది గ్యాస్ట్రిక్‌ సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

అయితే ప్రస్తుతం పిల్లలకు వ్యాక్సిన్‌ లేదు. గత వారం అమెరికాకు చెందిన ఫైజర్‌ తమ వ్యాక్సిన్‌ 12 నుంచి 15 ఏళ్ల వయసు వారిపై కూడా సమర్ధవంతంగా పని చేస్తుందని వెల్లడించింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ 5 నుంచి 18 ఏళ్ల మధ్య వారిపై ప్రయోగాలు జరపడానికి అనుమతి కోరినప్పటికీ, తగిన గణాంకాలు సమర్పించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

చిన్నారుల్లో కరోనా లక్షణాలు

► గ్యాస్ట్రిక్‌ సమస్యలు ► ఆకలి మందగించడం ► వాంతులు, విరోచనాలు ► ఒళ్లంతా దద్దుర్లు ► జ్వరం, పొడి దగ్గు ► శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

► భౌతిక దూరం పాటించడం ► ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను బయటకు వెళ్లనీయరాదు ► తప్పకుండా మాస్క్‌ ధరించేలా తల్లిదండ్రులు చూడాలి ► ముక్కు, ముఖం, కళ్లపై చేతులతో రుద్దుకోనివ్వవద్దు. కళ్ల ద్వారా కూడా వైరస్‌ సోకి అవకాశాలుంటాయి.

ఇవీ కూడా చదవండి:

Coronavirus: కరోనాతో భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా టీకాపై నిషేధం ఎత్తివేత.. ప్రకటించిన అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ

భారత్‌లో సెకండ్‌వేవ్‌ కరోనా వ్యాప్తిపై అంతర్జాతీయ మీడియా విశ్లేషణ.. కరోనా వ్యాప్తికి గల కారణాలేంటో తెలిపిన విదేశీ పత్రికలు