కరోనా ఎఫెక్ట్: 750కి పెరిగిన కంటైన్మెంట్ జోన్లు..
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న ప్రాంతం ముంబై. ఢిల్లీ మినహా ముంబైలో ఉన్నన్ని కరోనా పాజిటివ్
Containment zones in Mumbai: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో అత్యధిక కేసులు నమోదు అవుతున్న ప్రాంతం ముంబై. ఢిల్లీ మినహా ముంబైలో ఉన్నన్ని కరోనా పాజిటివ్ కేసులు మరే ఇతర నగరంలో లేవు. కాగా, ముంబైలో కేసుల శాతం రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి అనుగుణంగానే నగరంలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా పెంచిన వాటితో కలిపి ప్రస్తుతానికి ముంబైలో 750 కోవిడ్-19 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో లక్షన్నరకు పైగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా ఇందులో సగానికి పైగా కరోనా వైరస్ బారి నుంచి బయటపడి కోలుకున్నారు. సుమారు ఏడున్నర వేల మంది చనిపోయారు. ప్రస్తుతం 73,000 పై చిలుకు యాక్టివ్ కేసులున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
Also Read: ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో.. పీజీ మెడికల్ అడ్మిషన్లకు లైన్ క్లియర్..!