AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పబ్‌జి’ని కూడా బ్యాన్‌ చేయాల్సిందే..!

దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనాకు చెందిన 59 యాప్‌లను భారత్‌లో నిషేధిస్తూ కేంద్ర ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్‌ సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

'పబ్‌జి'ని కూడా బ్యాన్‌ చేయాల్సిందే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 30, 2020 | 10:40 PM

Share

దేశ భద్రత, రక్షణ దృష్ట్యా చైనాకు చెందిన 59 యాప్‌లను భారత్‌లో నిషేధిస్తూ కేంద్ర ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్‌ సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భారతీయులు విరివిగా వినియోగించే టిక్‌టాక్‌, షేర్‌ఇట్‌, యూసీ బ్రౌజర్ సహా పలు యాప్‌లు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఈ యాప్‌లన్నీ గూగుల్‌ ప్లే స్టోర్‌లో కూడా తొలగించబడ్డాయి. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. చైనాకు ఇది చెంపపెట్టు లాంటిదని తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ యాప్‌లతో పాటు పబ్‌జిని కూడా బ్యాన్‌ చేయాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. పబ్‌జినీ మొబైల్‌ ఫ్లాట్‌ఫాంకు తెచ్చేందుకు చైనాకు చెందిన ఓ కంపెనీ సాయం చేసిందని.. అందుకే ఈ గేమ్‌ను కూడా నిషేధించాలంటూ పలువురు ట్వీట్లు పెడుతున్నారు. అంతేకాదు ఈ ఆటకు బానిసైన వారు దారుణాలకు ఒడిగట్టారని వారు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ, అమిత్‌ షా సహా పలువురు అకౌంట్లకు ట్యాగ్‌ చేస్తూ పబ్‌జిని బ్యాన్‌ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో pubgban అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కాగా చైనా యాప్‌ల బ్యాన్‌ తరువాత అదే తరహాలో ఉండే భారత్‌ యాప్‌లకు డిమాండ్ పెరుగుతోంది. టిక్‌టాక్‌ని వాడే చాలా మంది ఇప్పుడు చించోరి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు.

Follow Us
వావ్.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ వాడితే..
వావ్.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ వాడితే..
బేబీ సినిమా లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.. అందుకే రిజెక్ట్ చేశా !
బేబీ సినిమా లో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.. అందుకే రిజెక్ట్ చేశా !
ఈ టాలీవుడ్ కమెడియన్ ను గుర్తు పట్టారా? ఈ జనరేషన్‌కు కూడా ఫేవరెట్
ఈ టాలీవుడ్ కమెడియన్ ను గుర్తు పట్టారా? ఈ జనరేషన్‌కు కూడా ఫేవరెట్
ఆ నటికి ప్రతినెల డబ్బులు పంపుతున్న పూరి జగన్నాథ్..
ఆ నటికి ప్రతినెల డబ్బులు పంపుతున్న పూరి జగన్నాథ్..
నకిలీ నోట్లను ఎలా గుర్తించాలంటే..? ఇవే బండ గుర్తులు
నకిలీ నోట్లను ఎలా గుర్తించాలంటే..? ఇవే బండ గుర్తులు
PCOD సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా హార్మోన్లను సెట్ చేసుకోండి!
PCOD సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా హార్మోన్లను సెట్ చేసుకోండి!
SRH vs KKR Live Score: తొలి గెలుపు కోసం ఎదురుచూపులు..
SRH vs KKR Live Score: తొలి గెలుపు కోసం ఎదురుచూపులు..
విమానం మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా? ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే..
విమానం మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా? ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే..
ఆ ప్లేయర్‌ను దింపేసిన కోహ్లీ.. వీడియో చూస్తే నవ్వాగదంతే..!
ఆ ప్లేయర్‌ను దింపేసిన కోహ్లీ.. వీడియో చూస్తే నవ్వాగదంతే..!
డబ్బు సంపాదించాలంటే కష్టపడటం ఆపండి.. ఎలాన్ మస్క్ 5 మనీ రూల్స్
డబ్బు సంపాదించాలంటే కష్టపడటం ఆపండి.. ఎలాన్ మస్క్ 5 మనీ రూల్స్