Covid-19 Vaccine: నేటినుంచి ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కోవ్యాక్సిన్ ట్రయల్స్..
Covaxin trials on children: దేశంలో పిల్లలకు కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ అందించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బీహార్ పాట్నా ఎయిమ్స్‌లో
Covaxin trials on children: దేశంలో పిల్లలకు కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ అందించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బీహార్ పాట్నా ఎయిమ్స్‌లో పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కూడా పిల్లలపై కరోనా టీకా కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభంకానున్నాయి. ఈ ట్రయల్స్‌ను 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలపై నిర్వహించనున్నారు. ఈ వ్యాక్సిన్ పిల్లలకు అనుకూలంగా ఉంటుందా.. లేదా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతాయా అనేది తెలుసుకోనున్నారు. కాగా దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. వైరస్ నుంచి రక్షణ పొందేందుకు తగినంత మందికి టీకాలు వేయకపోతే మూడో వేవ్‌లో వినాశనం సృష్టించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలపై థర్డ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ఇప్పటివకే వైద్య నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు ప్రభుత్వం అప్రమత్తమై పిల్లలకు కూడా టీకా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా 2 నుంచి 18 ఏళ్ల మధ్యనున్న పిల్లలపై రెండో దశ, మూడో దశ ట్రయల్స్ నిర్వహణకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవ్యాక్సిన్ కు మే 13న కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్, కోవ్యాక్సిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను మాత్రమే 18 ఏళ్లు పైబడిన వ్యక్తులకు వేస్తున్నారు. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. కాగా ఇప్పటివరకూ.. దేశవ్యాప్తంగా దాదాపు 24 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు అందించారు.
Also Read: