Breaking: ఏపీలో కరోనా విలయం.. కొత్తగా 5041 కేసులు, 56 మరణాలు..
Coronavirus Cases In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 31,148 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 5,041 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 49,650కి చేరింది. ఇందులో 26,118 యాక్టివ్ కేసులు ఉండగా.. 22,890 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో కరోనా […]

Coronavirus Cases In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 31,148 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 5,041 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 49,650కి చేరింది. ఇందులో 26,118 యాక్టివ్ కేసులు ఉండగా.. 22,890 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 642కి చేరింది.
మరోవైపు గడిచిన 24 గంటల్లో 1,106 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 56 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం 637, చిత్తూరు 440, ఈస్ట్ గోదావరి 647, గుంటూరు 354, కడప 226, కృష్ణ 397, కర్నూలు 364, నెల్లూరు 391, ప్రకాశం 150, శ్రీకాకుళం 535, విశాఖపట్నం 266, విజయనగరం 241, వెస్ట్ గోదావరిలో 393 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో తూర్పుగోదావరి(6146), కర్నూలు(6045), అనంతపురం(5141) జిల్లాల్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఎక్కువ కరోనా మరణాలు కర్నూలు(123), కృష్ణా(101) జిల్లాల్లో సంభవించాయి. కాగా, నేటి వరకు 13,15,532 సాంపిల్స్ ని పరీక్షించారు.
Also Read:
సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..
తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..
సచివాలయాల ద్వారా ఇకపై పేదలకు ఉచితంగా ఇసుక..
సామాన్యులకు షాక్.. పెరిగిన బియ్యం ధరలు..
2.5 కోట్ల ఇరానీయులకు కరోనా.. దేశాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..
ఏపీలో పెళ్లిళ్లకు కొత్త మార్గదర్శకాలు.. ఈజీగా అనుమతులు..
#COVIDUpdates: 19/07/2020, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 46,755 పాజిటివ్ కేసు లకు గాను *20,329 మంది డిశ్చార్జ్ కాగా *642 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 25,784#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/0r8Sa7yM0z
— ArogyaAndhra (@ArogyaAndhra) July 19, 2020




