Breaking: తెలంగాణలో ఒక్క రోజులోనే 8 కరోనా పాజిటివ్ కేసులు..

Coronavirus Outbreak: తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడ్డవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులోనే ఏకంగా 8 మందికి ఈ వైరస్ నిర్ధారణ అయింది. ఇక ఈ ఎనిమిది మందిలో ఏడుగురు ఇండోనేసియా పౌరులు కాగా.. మరొకరు స్కాట్‌ల్యాండ్ నుంచి మేడ్చల్ వచ్చిన ఓ యువకుడుగా గుర్తించారు. దీనితో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 13కు చేరుకుంది. మొట్టమొదటి కరోనా బాధితుడు డిశ్చార్జ్ కాగా.. ఇప్పుడు 12 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ఇండోనేషియా నుంచి […]

Breaking: తెలంగాణలో ఒక్క రోజులోనే 8 కరోనా పాజిటివ్ కేసులు..
Follow us

|

Updated on: Mar 19, 2020 | 7:49 AM

Coronavirus Outbreak: తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడ్డవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజులోనే ఏకంగా 8 మందికి ఈ వైరస్ నిర్ధారణ అయింది. ఇక ఈ ఎనిమిది మందిలో ఏడుగురు ఇండోనేసియా పౌరులు కాగా.. మరొకరు స్కాట్‌ల్యాండ్ నుంచి మేడ్చల్ వచ్చిన ఓ యువకుడుగా గుర్తించారు. దీనితో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 13కు చేరుకుంది. మొట్టమొదటి కరోనా బాధితుడు డిశ్చార్జ్ కాగా.. ఇప్పుడు 12 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక ఇండోనేషియా నుంచి వచ్చిన విదేశీయులు 10 మంది కరీంనగర్‌కు వచ్చారు. వీరిలో 8 మందికి కరోనా పాజిటివ్ తేలడంతో కరీంనగర్‌లో తీవ్ర కలకలం చెలరేగింది. దీనితో ప్రభుత్వం నివారణ చర్యలు చేపడుతోంది. వారితో దగ్గరగా ఉన్న వ్యక్తులను గుర్తించి.. ఇప్పటికే 13 మంది అనుమానితులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా 100 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం కరీంనగర్‌లో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

కాగా, తెలంగాణలో పాజిటివ్‌ కేసులు పెరగడంతో సర్కార్‌ అప్రమత్తం అయింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వెళ్లారు. కరోనాను ఎదుర్కోవడంపై వైద్యులు, అధికారులతో చర్చించారు. ఒక యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయడానికి మంత్రి పలు సూచనలు చేశారు.

For More News:

కరోనా ఎటాక్ @ సెకండ్ లెవెల్.. భారత్‌కు మిగిలింది 30 రోజులు మాత్రమే

కరోనా ఎఫెక్ట్.. రసికప్రియులకు గుడ్ న్యూస్…

ఫ్లాష్ న్యూస్: కరోనా ప్రభావం.. సీబీఎస్ఈ, జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా..