AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో కరోనా పేషెంట్ !

మార్చి 14..ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్, ఎస్ 9 బోగీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు మార్చి 14కు, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్‌కు ఏంటి లింకు..? ఆ రోజున ఎస్9 బోగీలో ఏం జరిగింది..? ఇదే ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది...

ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో కరోనా పేషెంట్ !
Jyothi Gadda
|

Updated on: Mar 19, 2020 | 10:51 AM

Share

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు బులెటిన్ విడుదల చేసింది. తాజా బులెటిన్‌ బట్టి చూస్తే ఒకే రోజులో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాలో సంచరించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందనే వార్త అందరిలోనూ మరింత ఆందోళన కలిగిస్తోంది. పైగా అతడు ఢిల్లీ నుంచి రైలులో బయల్దేరి రామగుండం చేరుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అతడు ప్రయాణించిన రైలులో ఇంకా ఎవరికైనా వైరస్ సోకిందా అనే అనుమానం అధికార యంత్రాంగాన్ని కూడా ఆందోళనకు గురిచేస్తోంది.

ఇటీవల ఇండోనేషియా నుంచి 11 మంది బృందం ఇటీవలే ఇండియాకు వచ్చింది. వారిలో 10 మంది కరీంనగర్‌ జిల్లా రామగుండం వెళ్లినట్లుగా తెలుస్తోంది. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైరస్ సోకిన వ్యక్తి మార్చి 14 వ తేదీన ఢిల్లీ నుంచి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో ఎస్ 9 బోగీలో బయలుదేరి మరుసటి రోజున రామగుండంలో దిగిపోయారు. అయితే, రామగుండం వచ్చిన తరువాత సదరు వ్యక్తికి దగ్గు, జలుబు పట్టుకున్నాయి. అతనికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మార్చి 15 వ తేదీన ఎస్ 9 బోగీలో ప్రయాణం చేసిన వ్యక్తుల వివరాలు కావాలని రైల్వే శాఖకు వైద్యశాఖ లేఖ రాసింది. మార్చి 17 వ తేదీన ఈ లేఖ రాసింది.

ఇండోనేసియా నుంచి కరీంనగర్‌ వచ్చిన 10 మంది బృందం ప్రయాణించిన రైలు బోగీలో 82 మంది ప్రయాణికులున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 8 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. వారు ప్రయాణించిన రైలుతో పాటు, ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా వారి వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు రైల్వే అధికారులు అందించారు.

Follow Us