AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రుతుపవనాలు ముఖం చాటేశాయా? తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటుతున్న ఎండలు..

చైనాలోని బావి తుఫాన్ ప్రభావంతో భారత రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రుతుపవన గాలులు దక్షిణ చైనా సముద్రం వైపు మళ్లడంతో భారత్‌కు తేమగాలుల రాక తగ్గి, బంగాళాఖాతంలో అల్పపీడనాల ఏర్పాటుకు ఆటంకం కలుగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గి ఎండల తీవ్రత పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 25 శాతం వర్షపాతం లోటు నమోదవగా, పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి..

రుతుపవనాలు ముఖం చాటేశాయా? తెలుగు రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటుతున్న ఎండలు..
Temperatures Soar Across AP and Telangana
Srilakshmi C
|

Updated on: Jul 13, 2026 | 10:40 AM

Share

అమరావతి, జులై 13: చైనాలోని బావి తుఫాన్ ప్రభావం.. భారత రుతుపవనాలపై తీవ్ర ప్రభావంగా పడనుంది. రుతుపవన గాలులు దక్షిణ చైనా సముద్రం వైపు మళ్లినట్లు వాతావరణ నిపుణుల అంచనా వేస్తున్నారు. భారత్ వైపు తేమగాలుల రాక తగ్గడంతో.. బంగాళాఖాతంలో అల్పపీడనాల ఏర్పాటుకు ఆటంకం కలుగుతుంది. ఈ నెల 16 లేదా 17న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో ఏపీలో పలు జిల్లాలలో ఎండలు మళ్లీ మండుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాతావరణం రెండో వేసవిని తలపిస్తున్నాయి. నిన్న తిరుపతిలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా జిల్లాల్లో ఎండలతోపాటు వడగాడ్పులు ఠారెత్తిస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 25 శాతం వర్షపాతం లోటు నమోదైంది.

తెలంగణలోనూ ఇదే పరిస్థితి..

ఎల్‌ నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తుంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదవుతుండడంతో మళ్లీ ఉక్కపోత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదివారం ఖమ్మం సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో గరిష్ఠంగా 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. వరంగల్‌, జనగామ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, హనుమకొండ, భూపాలపల్లి, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట తదితర జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జులై 15 వరకు వాతావరణం ఈ విధంగానే ఉంటుందని తెలిపింది. జులై 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.

కాగా ప్రస్తతం రుతుపవన ద్రోణి శ్రీగంగానగర్‌, హిస్సార్‌, మీరట్‌, గోరఖ్‌పూర్‌ మీదుగా దక్షిణ అస్సాం వరకు కొనసాగుతుంది. దీంతో వచ్చే మూడు రోజులు అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో ఉపరితల గాలులు 40 నుంచి 50 కి.మీ వేగంతో, తెలంగాణ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

Follow Us
రుతుపవనాలు ముఖం చాటేశాయా? రోజూ 40 డిగ్రీలు దాటుతున్న ఎండలు..
రుతుపవనాలు ముఖం చాటేశాయా? రోజూ 40 డిగ్రీలు దాటుతున్న ఎండలు..
పెద్దలు చెప్పని రహస్యం.. ఆషాఢం వెనకున్న సీక్రెట్ తెలుసా?
పెద్దలు చెప్పని రహస్యం.. ఆషాఢం వెనకున్న సీక్రెట్ తెలుసా?
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు..
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు..
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ 'మాయ'..: మాజీ ప్లేయర్
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ 'మాయ'..: మాజీ ప్లేయర్
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
30 నిమిషాల్లో రెడీ అయ్యే ఈజీ బ్యాచిలర్స్ చికెన్ ఫ్రై.. యమ్మీ ఫుడ్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
చనిపోదామని రైలు పట్టాలపైకి.. చివరకు ప్లాన్ మార్చిన సైకో కిల్లర్
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
వింబుల్డన్‌‌లో మెరిసిన వైభవ్.. ఫేవరేట్ స్టార్ ఎవరో తెలుసా?
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..