ఏపీలో జనవరి 15 తర్వాత కరోనా సెకండ్‌ వేవ్‌? రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అంచనా.. అప్రమత్తంగా ఉండాలని సూచన.!

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించే అవకాశముందని తాజాగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా..

ఏపీలో జనవరి 15 తర్వాత కరోనా సెకండ్‌ వేవ్‌? రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అంచనా.. అప్రమత్తంగా ఉండాలని సూచన.!
Ravi Kiran

|

Dec 13, 2020 | 8:57 AM

Coronavirus In AP: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించే అవకాశముందని తాజాగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా కంట్రోల్‌కి వస్తోంది. ఒకప్పుడు రోజుకు 10 వేల కేసుల నమోదవ్వగా.. ఇప్పుడు సగటున రోజూ 600 కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా బ్రిటన్, రష్యా లాంటి దేశాలతో పాటు ఢిల్లీ, కేరళతో సహా పలు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశమున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. చలి తీవ్రత పెరిగే కొద్దీ కరోనా వ్యాప్తి కూడా పెరుగుతుందని.. జనవరి 15 తర్వాత కరోనా కేసులు మళ్లీ పీక్స్‌కు చేరే అవకాశం లేకపోలేదని పేర్కొంది. సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సూచించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పలు దేశాలు, రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఆయా ప్రదేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దశ నుంచి సరిగ్గా ఐదు నెలల తర్వాత సెకండ్ వేవ్ వచ్చింది. ఇదే పరిస్థితి ఢిల్లీలోనూ జరిగిందని వైద్య నిపుణులు అంచనా వస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. ఏపీలో ఆగష్టు-సెప్టెంబర్ మధ్య కరోనా పీక్ స్టేజిలో ఉందని .. ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వచ్చిందన్నారు. ఇక తిరిగి ఐదు నెలల్లో అంటే.. 2021 జనవరి 15 నుంచి మార్చి 15 మధ్య సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయన్నారు. సెకండ్ వేవ్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అప్రమత్తం కావాల్సిన అవసరముందని.. ప్రతి 15 రోజులకూ టీచర్లకు, అంగన్‌వాడీ వర్కర్లకు కరోనా టెస్టులు చేయాలని సూచించారు. అలాగే జనవరిలో తిరిగి బెడ్‌లు, వెంటిలేటర్లు, ఐసీయూలు సిద్ధం చేయాలన్నారు. ఇక హైరిస్క్‌ ఉన్న వారికి ప్రత్యేక వైద్య పరీక్షలు..  మండల స్థాయిలోనూ కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.

కాగా, కరోనా సెకండ్ వేవ్ అంచనాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో అడ్వైజరీ కమిటీని నియమించింది. ఇందులో నలుగురు గవర్నమెంట్ వైద్య నిపుణులు, ముగ్గురు ప్రైవేట్ ఆసుపత్రికి చెందిన వారు ఉన్నారు. ఈ కమిటీ కరోనా సెకండ్ వేవ్ అవకాశాలపై అంచనా వేయడంతో పాటు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇచ్చింది.

Also Read:

‘జగనన్న అమ్మఒడి’ వివరాలను చెక్ చేసుకోండిలా.. సూచనలు ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ..

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసైన రోహిత్ శర్మ.. ఆసీస్ ఫ్లైట్ ఎక్కనున్న హిట్‌మ్యాన్..

మరో చోట ప్రత్యక్షమైన వింత స్థంభం.. షాకవుతున్న ప్రజలు.. మిస్టరీని చేధిస్తున్న పరిశోధకులు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu