ఏపీ: ఆ జిల్లాలో ప్రతీ ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌..

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. టెస్టుల పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళంలో జిల్లా యంత్రాంగం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది.

  • Ravi Kiran
  • Publish Date - 11:54 am, Sun, 23 August 20
ఏపీ: ఆ జిల్లాలో ప్రతీ ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌..

Lockdown In Srikakulam: ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. టెస్టుల పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు వంటి నగరాలతో పాటు గ్రామాల్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆయా జిల్లాల్లో అధికారులు మరోసారి లాక్ డౌన్ ప్రకటించారు. ఇదే కోవలో తాజాగా శ్రీకాకుళంలో జిల్లా యంత్రాంగం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు ఈ లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

రేపు ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు, మెడికల్ షాపులు మినహా మిగతా అన్నీ కూడా మూసి ఉంటాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవ్వరూ కూడా బయటికి రాకూడదని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని.. ప్రజలందరూ ఈ లాక్ డౌన్‌కు సహకరించాలని తెలిపారు. కాగా, ఇకపై ప్రతీ ఆదివారం జిల్లాలో లాక్ డౌన్ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. నిన్న శ్రీకాకుళం ఐదుగురు కరోనాతో మరణించారు.

Also Read:

ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!

Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..

చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!

సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

‘సీఎం కావడానికి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి’..

ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…

టెర్రరిస్టుల జాబితాలో దావూద్.. లిస్టు రిలీజ్ చేసిన పాకిస్థాన్