టెర్రరిస్టుల జాబితాలో దావూద్.. లిస్టు రిలీజ్ చేసిన పాకిస్థాన్

అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం పేరును టెర్రరిస్టుల జాబితాలో పేర్కొంటూ తాజాగా పాకిస్థాన్ ఓ లిస్టును విడుదల చేసింది. దావూద్‌ కరాచీలోనే ఉన్నట్టుగా కూడా పాక్ అంగీకరించింది.

టెర్రరిస్టుల జాబితాలో దావూద్.. లిస్టు రిలీజ్ చేసిన పాకిస్థాన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 22, 2020 | 8:02 PM

Dawood Ibrahim In Pakistan Terrorist List: అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం పేరును టెర్రరిస్టుల జాబితాలో పేర్కొంటూ తాజాగా పాకిస్థాన్ ఓ లిస్టును విడుదల చేసింది.  హాఫిజ్ సయీద్, మొహమ్మద్ అజర్ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. అలాగే 88 మంది రాజకీయ నాయకులూ ఉన్నారు. ఇకపై వీరందరి మీద ఆంక్షలు ఉండనున్నాయి. వీరి బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయనున్నారు.దావూద్‌ కరాచీలోనే ఉన్నట్టుగా కూడా పాక్ అంగీకరించింది. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి పాకిస్థాన్ ఈ జాబితాను రిలీజ్ చేసింది. మాఫియా డాన్‌ దావుద్ ఇన్నేళ్లుగా పాకిస్థాన్‌లో దాగుడుమూతలు ఆడగా.. అతనిపై తాజాగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. కాగా, 1993 ముంబై పేలుళ్ల కేసులో మాస్టర్‌ మైండ్‌గా ఉన్న దావూద్.. అప్పటి నుంచి పాకిస్తాన్‌లోనే తలదాచుకుంటున్నాడు.

Also Read:

ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!

Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..

చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!

సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..