నాగార్జున సాగర్ వద్ద 144 సెక్షన్‌ విధింపు

నాగార్జున సాగర్ ప్రాంతంలో అధికారులు 144 సెక్షన్‌ని విధించారు. సాగర్‌కి వరద ఉధృతి కొనసాగుతుండటంతో డ్యామ్ క్రస్ట్‌ గేట్లను ఎత్తివేయగా

నాగార్జున సాగర్ వద్ద 144 సెక్షన్‌ విధింపు
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2020 | 12:23 PM

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ ప్రాంతంలో అధికారులు 144 సెక్షన్‌ని విధించారు. సాగర్‌కి వరద ఉధృతి కొనసాగుతుండటంతో డ్యామ్ క్రస్ట్‌ గేట్లను ఎత్తివేయగా.. కరోనా నేపథ్యంలో పర్యాటలకు రాకూడదని అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేసి, పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే జలాశయం పరిధిలోని లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో సాగర్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. మరోవైపు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండుగా.. ఆ జలాలు నాగార్జున సాగర్‌కి చేరుకుంటున్నాయి.

Read More:

Zombie Reddy 1st Look: ‘జాంబీ రెడ్డి’ ఎవరో తెలిసిపోయింది

ఆసుపత్రిలో తప్పు చేసినట్లుగా రియా ప్రవర్తించింది: ప్రత్యక్షసాక్షి