ఏపీలో తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగిన కరోనా కేసులు..!
Coronavirus In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,293 పాజిటివ్ కేసులు, 48 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,68,751కి చేరింది. వీటిల్లో 65,794 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,97,294 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 5606కి చేరుకుంది. అటు గడిచిన 24 గంటల్లో 9,125 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క […]
Coronavirus In Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,293 పాజిటివ్ కేసులు, 48 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,68,751కి చేరింది. వీటిల్లో 65,794 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,97,294 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 5606కి చేరుకుంది.
అటు గడిచిన 24 గంటల్లో 9,125 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1011 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత చిత్తూర్ 975 కేసులు నమోదయ్యాయి. ఇక అనంతపురం 513, పశ్చిమగోదావరి 922, గుంటూరు 393, కడప 537, కృష్ణ 450, కర్నూలు 206, నెల్లూరు 466, శ్రీకాకుళం 306, విజయనగరం 444, ప్రకాశంలో 620, విశాఖపట్నం 450 కేసులు నమోదయ్యాయి. కాగా, తూర్పుగోదావరిలో అత్యధికంగా 93,184 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరులో 633 కరోనా మరణాలు సంభవించాయి.
Also Read:
ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..