‘రూ.80 వేల కోట్లు ఉన్నాయా ?’ ప్రభుత్వానికి సీరం కంపెనీ సీఈఓ సవాల్

వచ్ఛే ఏడాదికాలంలో ప్రభుత్వం వద్ద రూ..80 వేల కోట్లు అందుబాటులో ఉంటాయా అని పూణే లోని సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా ప్రశ్నించారు. ఎందువల్లంటే తాము ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ కరోనా వైరస్ వ్యాక్సీన్ ని..

'రూ.80 వేల కోట్లు ఉన్నాయా ?' ప్రభుత్వానికి సీరం కంపెనీ సీఈఓ సవాల్
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 26, 2020 | 6:47 PM

వచ్ఛే ఏడాదికాలంలో ప్రభుత్వం వద్ద రూ..80 వేల కోట్లు అందుబాటులో ఉంటాయా అని పూణే లోని సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా ప్రశ్నించారు. ఎందువల్లంటే తాము ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ కరోనా వైరస్ వ్యాక్సీన్ ని కొనుగోలు చేసి, ఇండియాలోని ప్రతి వ్యక్తికీ అందజేయాలంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఇంత మొత్తం అవసరమవుతుందని ఆయన ట్వీట్ చేశారు. ఇది తమ ముందున్న అతి పెద్ద సవాల్ అన్నారు. తాము ఈ వ్యాక్సీన్ విషయంలో ఇండియాలోనూ, విదేశాల్లోనూ ఉన్న ఉత్పత్తిదారులతో సంప్రదించాల్సి ఉంటుందని, మన దేశ అవసరాలు, పంపిణీ కోసం ఎనభై వేల కోట్లు సరిపోతాయని అంచనా వేస్తున్నామన్నారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా డెవలప్ చేస్తున్న ఈ వ్యాక్సీన్ పంపిణీపైన, వాలంటీర్లపై ట్రయల్స్ పైన సీరం కంపెనీ దృష్టి పెట్టింది. మన దేశంలో ప్రస్తుతం రెండు, మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ లో ఈ సంస్థ నిమగ్నమై ఉంది. ఇతర వ్యాక్సీన్లను కూడా ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.