Breaking: ఏపీలో 50 వేలు దాటిన కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వెన్నులో వణుకు పుట్టించేలా విస్తరిస్తోంది. గత కొద్దిరోజులుగా వరుసగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4074 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Breaking: ఏపీలో 50 వేలు దాటిన కరోనా కేసులు..
Follow us

|

Updated on: Jul 20, 2020 | 6:52 PM

Corona Positive Cases Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వెన్నులో వణుకు పుట్టించేలా విస్తరిస్తోంది. గత కొద్దిరోజులుగా వరుసగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4074 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 53,724కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 28,800 కాగా, 24,228 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 696కి చేరింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అనంతపురం(5483), కర్నూలు(6604), గుంటూరు(5494), తూర్పుగోదావరి(7232)లలో ఎక్కువ పాజిటివ్ కేసులు ఉండగా.. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 1086 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక కర్నూలు(126), కృష్ణ(108)లలో అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. అటు గడిచిన 24 గంటల్లో 1335 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. తూర్పు గోదావరి, గుంటూరులలో తొమ్మిది మంది చొప్పున, కృష్ణలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇక నేటి వరకు రాష్ట్రంలో 13,49,112 సాంపిల్స్‌ను పరీక్షించారు.

Also Read:

సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు మళ్లీ వాయిదా..

ఏపీలో కరోనా కల్లోలం.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..