బీహార్‌లో పిడుగుల బీభత్సం..ఎంత మంది చనిపోయారంటే…

బీహార్ లో ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుంటే.. మరో వైపు భీకర వర్షాలకు తోడు పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో..

బీహార్‌లో పిడుగుల బీభత్సం..ఎంత మంది చనిపోయారంటే...
Follow us

|

Updated on: Jul 20, 2020 | 6:25 PM

Killed In Lightning Strikes In Bihar : బీహార్ లో ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. ఓ వైపు కరోనా విలయతాండవం చేస్తుంటే.. మరో వైపు భీకర వర్షాలకు తోడు పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 16 మంది పిడుగుపాటుకు గురై చనిపోయారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలపాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కొన్ని వారాలుగా రాష్ట్రంలో సంభవిస్తున్న పిడుగుపాటుకు వందల సంఖ్యలో జనం మ‌ృత్యువాత పడ్డారు. గత మూడు వారాల్లోనే 160 మందికి పైగా మరణించినట్లుగా తెలుస్తోంది. నిన్న ఆదివారం ఒక్కరోజే బీహార్ లోని ఏడు జిల్లాల్లో 10 మంది పిడుగుపాటుతో మ‌ృతి చెందారు. అత్యధికంగా జూన్ 25న ఒక్కరోజే బీహార్ లో 83 మంది మ‌ృతి చెందిన సంగతి తెలిసిందే.