“హరితహారం’ మేకలకు ఆహారం..ఫైన్‌ వేసిన అధికారులు

రాష్ట్ర వ్యాప్తంగా హరిత హరం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. నాటిన ప్రతి మొక్కను తప్పక బ్రతికించాలని సూచిస్తోంది. హరిత హరంలో నాటిన మొక్కలు ఎవరైనా కొట్టేసిన, పశువులు మేసిన జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు.

"హరితహారం' మేకలకు ఆహారం..ఫైన్‌ వేసిన అధికారులు

రాష్ట్ర వ్యాప్తంగా హరిత హరం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. నాటిన ప్రతి మొక్కను తప్పక బ్రతికించాలని సూచిస్తోంది. హరిత హరంలో నాటిన మొక్కలు ఎవరైనా కొట్టేసిన, పశువులు మేసిన జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే హరితహరంలో నాటిన మొక్కలను మేకలు మేయటంతో అధికారులు వాటి యజమానులకు ఫైన్‌ విధించిన ఘటనలు అనేకం వార్తల్లో వచ్చాయి. అయితే, తాజాగా, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోనూ అటువంటి ఘటనే చోటు చేసుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలో హరిత హరం కార్యక్రమంలో భాగాంగా అధికారులు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. పాల్వంచ నవభారత్ ఏరియాలోని కలెక్టర్ ఆఫీస్ కు సమీపంలో మేకలు హరితహారంలో నాటిన మొక్కలు తింటుండగా… పాల్వంచ శానిటరీ ఇన్స్పెక్టర్ గమనించి వాటిని పాల్వంచ మున్సిపల్ ఆఫీస్ కు తరలించారు. మేకలను ఆఫీసులో కట్టేశారు. మొక్కలు తిన్న మేకలకు ఫైన్ విధిస్తామని చెప్పారు. వాటి యజమానులు వచ్చి ఫైన్‌ చెల్లించి మేకలను తీసుకెళ్లాలని చెప్పారు .