AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Medicine: కరోనాను అణిచివేసే కొత్త మందు..ఎలుకల్లో చేసిన ప్రయోగాలు సక్సెస్..శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు

Corona Medicine: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ.. దాని వ్యాధి లక్షణాలను ఎదుర్కోవడంపై ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా, అమెరికా శాస్త్రవేత్తల ఒక పరిశోధన మంచి ఫలితాన్ని ఇచ్చినట్టుగా చెబుతున్నారు.

Corona Medicine: కరోనాను అణిచివేసే కొత్త మందు..ఎలుకల్లో చేసిన ప్రయోగాలు సక్సెస్..శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు
Corona Medicine
KVD Varma
|

Updated on: May 24, 2021 | 12:48 PM

Share

Corona Medicine: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ.. దాని వ్యాధి లక్షణాలను ఎదుర్కోవడంపై ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా, అమెరికా శాస్త్రవేత్తల ఒక పరిశోధన మంచి ఫలితాన్ని ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఇది కోవిడ్ ను వదిలించుకునే దిశలో కొత్త ఆశను కల్పిస్తోంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయంలోని మెండిస్ హెల్త్ ఇనిస్టిట్యూట్ మరియు సిటీ ఆఫ్ హోప్ రీసెర్చ్ అండ్ ట్రీట్‌మెంట్ సెంటర్ ఒక విప్లవాత్మక చికిత్సను రూపొందించాయి. దాని సహాయంతో, కోవిడ్ -19 వైరస్ ను లక్ష్యంగా చేసుకోవచ్చు. అదేవిధంగా పూర్తిగా తొలగించే అవకాశమూ ఉందని చెబుతున్నారు. పరిశోధనా బృందానికి నాయకత్వం వహించిన శాస్త్రవేత్త నిగెల్ మక్మిలన్ చెబుతున్న ప్రకారం, శరీరంలోకి ప్రవేశించే 99.9% వైరస్లు ఆర్ఎన్ఏ (RNA) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాటి మూలం నుంచి తొలగించడం జరిగింది.

దీనికి సంబంధించి ఊపిరితిత్తులకు కోవిడ్ వ్యాపించిన ఎలుకలలో నిర్వహించిన ప్రయోగంలో కోవిడ్ -19 పూర్తిగా నిర్మూలించగలిగారు. ఈ చికిత్స కోవిడ్ 19 ను నయం చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి వైరస్ లేదా వాటి కొత్త వేరియంట్‌లకు కూడా చికిత్స చేయగలదని పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ కెవిన్ మోరిస్ చెప్పారు.

ఈ చికిత్సను రూపొందించడానికి, శాస్త్రవేత్తలు జన్యువులను లక్ష్యంగా చేసుకుని జన్యు నిశ్శబ్ద పద్ధతులను ఉపయోగించారు. 90 వ దశకంలో ఆస్ట్రేలియాలోని మొక్కలలో జీన్ సైలెన్సింగ్ టెక్నిక్ కనుగొన్నారు. వైరస్ యొక్క జన్యువు ఈ సాంకేతికత ద్వారా తొలగించడం జరుగుతుంది. దీనిని ఇప్పుడు కరోనాపైనా ప్రయోగాత్మకంగా చేసి చూశారు. దీనివలన మంచి ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ సాంకేతికత అభివృద్ధి చేసిన ఔషధాన్ని నిల్వ చేయడమూ సులభమే. ప్రొఫెసర్ మోరిస్ ఈ టెక్నిక్‌తో చేసిన ఇంజెక్షన్లు తీవ్రమైన రోగులను 4 నుండి 5 రోజుల్లో నయం చేస్తాయని చెప్పారు. ఫలితం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పారు. అయితే, ఈ మందు క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావడానికి రెండు సంవత్సరాలు పట్టవచ్చునని అయన చెప్పారు. ఈ విధానంలో ఔషధం నేరుగా రోగి ఊపిరితిత్తులలోకి ఇస్తారు. రోగి యొక్క శరీరంలో ఉన్న కోవిడ్ -19 జన్యువును చంపడం ద్వారా శరీరం లేదా ఊపిరితిత్తులలో సంక్రమణ పెరగకుండా ఈ మందు నిరోధిస్తుంది. ఫలితంగా, నిరోధక కణాలు వైరస్ ను చంపుతాయి. ఈ చికిత్సను డైరెక్ట్ యాక్టింగ్ యాంటీ వైరల్ థెరపీగా పిలుస్తారు. చికిత్స సమయంలో, ఔషధం లిపిడ్ నానో కణం ద్వారా రోగి యొక్క ఊపిరితిత్తులలోకి విడుదల అవుతుంది. ఈ ఔషధం పై మరిన్ని పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్నీ పూర్తి చేసుకుని క్లినికల ట్రయల్స్ మొదలు పెట్టే ప్రయత్నాలు చేస్తామంటున్నారు. ఎలా చేసినా మరో రెండేళ్లకు కానీ, ఈ మందు అందుబాటులోకి రాదు. కానీ, ఈ విధానంలో కచ్చితంగా కరోనాను జయిస్తామని శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు.

Also Read: Corona: ఒక్కరికి కరోనా వస్తే.. 27 మందికి వచ్చినట్టే.! ఐసీఎంఆర్ సర్వేలో షాకింగ్‌ నిజాలు..

Covaxin: భారత్ బయోటెక్ మరో ముందడుగు.. జూన్‌లో పిల్లలపై కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్..