Covaxin: భారత్ బయోటెక్ మరో ముందడుగు.. జూన్‌లో పిల్లలపై కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్..
Bharat Biotech: దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్-19 వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి
Bharat Biotech: దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్-19 వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా.. హైదరాబాద్ ఫార్మా దిగ్గజం.. భారత్ బయోటెక్ 2-18 ఏళ్ల వయస్సు వారిపై కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి పిల్లలపై కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. అయితే.. దేశవ్యాప్తంగా 525 మంది బాలలపై ప్రయోగాలు జరుపనున్నట్టు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ప్రయోగాలు త్వరగా పూర్తయితే..ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో పిల్లలకు కోవాక్సిన్ టీకా వేసేందుకు అనుమతులు వస్తాయని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే.. పిల్లలపై కోవాక్సిన్ ఫేజ్ 2, 3 క్లినికల్ ట్రయల్స్‌కు ఇటీవలే కేంద్రం అనుమతులు మంజూరుచేసిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు భారత్ బయోటెక్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ అడ్వకసీ హెడ్ డా. రాచెస్ ఎల్లా మాట్లాడారు. కోవాక్సిన్ ద్వారా జూన్ నుంచి పిల్లలపై ప్రయోగం జరపనున్నట్లు వెల్లడించారు. భారత్ బయోటెక్ కోవాక్సిన్ ప్రొడక్షన్‌ను పెంచి సంవత్సరం చివరి నాటికి 700ల మిలియన్ డోసులు ఉత్పత్తి చేయగలదని భావిస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా గుజరాత్‌లో కూడా ఉత్పత్తి చేపడుతున్నట్లు వివరించారు. కాగా.. 2 నుంచి 18 ఏళ్ల మధ్య వారికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) మే 13న ఆదేశాలిచ్చింది.
Also Read: