కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 593 పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసుల సంఖ్య ఎంతంటే..?

తెలంగాణ కరోనా తీవ్రత తగ్గినట్లు ప్రభుత్వం రిలీజ్ చేస్తోన్న బులిటెన్స్‌ను బట్టి అర్థమవుతోంది. రాష్ట్రంలో కొత్తగా 593 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 593 పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసుల సంఖ్య ఎంతంటే..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 30, 2020 | 9:01 AM

తెలంగాణ కరోనా తీవ్రత తగ్గినట్లు ప్రభుత్వం రిలీజ్ చేస్తోన్న బులిటెన్స్‌ను బట్టి అర్థమవుతోంది. రాష్ట్రంలో కొత్తగా 593 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,69,816కి చేరింది.  ఆదివారం ఒక్కరోజే వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 1,458కి చేరింది. ఆదివారం వ్యాధి బారి నుంచి నిన్న 1058 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,58,336కి చేరింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 119 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 61 మేడ్చల్‌ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 10,022 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. వారిలో 7,946 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపింది.

Also Read :

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్, డిసెంబర్ 25న ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం

AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !

Ind vs Aus : రెండో వన్డే​లో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు