Bigg Boss 4: నాగార్జునతో కలిసి సందడి చేసిన ‘కిచ్చ’ సుదీప్‌.. అందరూ ఊహించినట్లుగానే..!

బిగ్‌బాస్‌ సండే ఫన్‌డే ఎపిసోడ్‌లో నాగార్జునతో కలిసి కన్నడ స్టార్ నటుడు కిచ్చ సుదీప్ సందడి చేశారు. కన్నడలో వరుసగా ఏడు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన సుదీప్

Bigg Boss 4: నాగార్జునతో కలిసి సందడి చేసిన 'కిచ్చ' సుదీప్‌.. అందరూ ఊహించినట్లుగానే..!
Follow us

| Edited By:

Updated on: Nov 30, 2020 | 9:13 AM

Avinash Bigg Boss 4: బిగ్‌బాస్‌ సండే ఫన్‌డే ఎపిసోడ్‌లో నాగార్జునతో కలిసి కన్నడ స్టార్ నటుడు కిచ్చ సుదీప్ సందడి చేశారు. కన్నడలో వరుసగా ఏడు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన సుదీప్‌.. స్టేజ్‌పైకి వచ్చి కంటెస్టెంట్‌లకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున సర్ ఎక్కడా అంటూ కంటెస్టెంట్‌లు అడగ్గా.. రాలేదని సుదీప్ చెప్పారు. నాగార్జున్ ఎందుకు రావాలో చెప్పాలని కంటెస్టెంట్‌లు అడగ్గా.. వారు వారి వారి అభిప్రాయాలు చెప్పారు. ఆ తరువాత స్టేజ్‌ మీదకు వచ్చిన నాగార్జున.. హోస్టింగ్ పరంగా నువ్వు నాకంటే సీనియర్‌వి అని సరదాగా మాట్లాడారు.

దీంతో బిగ్‌బాస్ వలనే చాలా నేర్చుకున్నానని.. హోస్టింగ్‌ కూడా బిగ్‌బాస్ నేర్పిందేనని తెలిపారు. ఇక కంటెస్టెంట్‌లతో సరదాగా మాట్లాడిన సుదీప్‌.. వాళ్లకి ఫన్నీ ఫన్నీ ప్రశ్నలు వేస్తూ.. ఆసక్తికరమైన సమాధానాలను రాబట్టారు. ఇక ఎలిమినేషన్‌లో భాగంగా నామినేషన్స్‌లో ఉన్న అఖిల్, అరియానా, అవినాష్‌లలో అఖిల్‌ని సేవ్ చేశారు సుదీప్. దీంతో అఖిల్ సంతోషపడిపోయాడు. నన్ను సేవ్ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనం అని తెలియజేశాడు. ఇక అఖిల్‌ సేవ్‌ అవ్వడంతో మోనాల్ కూడా చాలా సంతోషపడింది.

చివరగా రెండు టీపీలు ఇచ్చి అందులో రెడ్, గ్రీన్ కలర్ రంగులు ఉంచామని.. రెడ్ కలర్ వచ్చిన వాళ్లు ఎలిమినేట్ అని, గ్రీన్ కలర్‌ వచ్చిన వాళ్లు సేవ్ అయినట్లు అని నాగార్జున చెప్పాడు. ఈ క్రమంలో అవినాష్‌కి రెడ్‌ కలర్‌, అరియానాకు గ్రీన్ కలర్ వచ్చాయి. అయితే ఈ ప్రాసెస్‌ కంటే ముందు అవినాష్‌.. తాను ఎలిమినేట్ అయినట్లు అనిపిస్తుందని, అందుకే ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ని వాడుకుంటానని చెప్పాడు. దీంతో ఇటు అవినాష్‌, అటు అరియానా ఇద్దరు సేవ్ అయ్యారు. మొత్తానికి ముందుగా పుకార్లు వచ్చినట్లుగానే ఈ వారం ఎలిమినేషన్‌ జరగలేదు. అలాగే అవినాష్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు.

ఇక ఎవిక్షన్ పాస్ ద్వారా సేవ్‌ అయ్యాను. కానీ ప్రేక్షకుల అభిప్రాయంలో నేను ఎలిమినేట్ అయినట్లే కదా. ముందుకు వెళ్లాలా..? ఆగాలా..? తెలీడం లేదు అని అవినాష్ బాధపడ్డాడు. దాంతో నువ్వు మళ్లీ సెల్ఫ్ సింపథీలోకి వెళ్లకు. ఎవరు ఆట వారు బాగా ఆడండి అని నాగార్జున ధైర్యం చెప్పారు.

రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..