రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్, డిసెంబర్ 25న ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
ఏపీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. డిసెంబర్ 25 తేదీ నుంచి తొలి దశ కింద 15,10,227 ఇళ్ల నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం ప్రారంభించనుంది.

ఏపీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకు గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. డిసెంబర్ 25 తేదీ నుంచి తొలి దశ కింద 15,10,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. వీటిలో వైఎస్సార్ జగనన్న కాలనీల కింద ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలాలలో 11,22,559 ఇళ్లు నిర్మితం అవ్వనున్నాయి. మిగతా 3,87,668 ఇళ్లు.. వ్యక్తిగత స్థలాలున్న వారికి మంజూరు చేయనుంది ప్రభుత్వం. వీటిని పురపాలక సంఘాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో (యూడీఏ) చేపట్టనుంది. 1,26,974 మంది లబ్ధిదారుల నుంచి ఇప్పటికే పొజిషన్ సర్టిఫికెట్లను గృహ నిర్మాణశాఖ అధికారులు సేకరించారు. ఇంకా 2,60,974 మంది నుంచి సర్టిఫికెట్స్ సేకరించాల్సి ఉంది.
జగనన్న కాలనీల్లో చేపట్టే ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ముడి సరకును గవర్నమెంటే అందేజేస్తుంది. ఇసుకను ఫ్రీగా సరఫరా చేయనున్నారు. సిమెంటును రూ.220 నుంచి రూ.240లోపు ధరలతో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర సామగ్రిని రివర్స్ టెండర్ల ప్రక్రియలో కొనుగోలు చేయనుంది ప్రభుత్వం. కిటికీలు, తలుపులు, ఇనుము, పెయింట్స్, ఎలక్ట్రికల్ వస్తువులు, శానిటరీ సామగ్రి తదితరాలకు రాష్ట్ర స్థాయిలో టెండర్లను నిర్వహించనున్నారు అధికారులు.
Also Read :
AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !
Ind vs Aus : రెండో వన్డేలో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు