Corona Cases AP: ఏపీలో తగ్గుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!

Corona Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 57,716 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 379 పాజిటివ్ కేసులు..

Corona Cases AP: ఏపీలో తగ్గుతోన్న పాజిటివ్ కేసుల సంఖ్య.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!
corona-ap
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 23, 2020 | 6:15 PM

Corona Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 57,716 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 379 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,79,718కి చేరింది. ఇందులో 3864 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,68,769 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా ముగ్గురు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 7085కు చేరుకుంది. ఇక నిన్న 490 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,14,15,246 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 19, చిత్తూరు 64, తూర్పుగోదావరి 35, గుంటూరు 46, కడప 33, కృష్ణా 84, కర్నూలు 5, నెల్లూరు 15, ప్రకాశం 13, శ్రీకాకుళం 16, విశాఖపట్నం 32, విజయనగరం 4, పశ్చిమ గోదావరి 13 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

Also Read:

‘స్ట్రెయిన్’ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. జనవరి 1 నుంచి చలానాల బాదుడు షురూ.. లైట్ తీసుకుంటే ఇక అంతే.!

ఆన్‌లైన్‌ కాల్‌మనీపై సీఎం జగన్ సీరియస్.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

‘సీబీఎస్‌సీ’ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..!