AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫైనల్ ఇయర్ పరీక్షలపై విద్యార్థుల్లో గందరగోళం

వివిధ కోర్సుల ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా, తాజాగా యూజీసీ మాత్రం సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించాలని సూచించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఇప్పుడు గందరగోళం నెలకొంది.

ఫైనల్ ఇయర్ పరీక్షలపై విద్యార్థుల్లో గందరగోళం
Balaraju Goud
|

Updated on: Jul 08, 2020 | 1:05 PM

Share

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పాస్ చేస్తున్నారు. అయితే, వివిధ కోర్సుల ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుండగా, తాజాగా యూజీసీ మాత్రం సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించాలని సూచించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఇప్పుడు గందరగోళం నెలకొంది.

కరోనా వైరస్ కారణంగా గత కొన్ని రోజులుగా స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం పాఠశాలలు, కాలేజీలు, ఇతర ఇనిస్టిట్యూట్స్ మూసివేయాలని ఆదేశించారు. దీంతో కొన్ని నెలలుగా కాలేజీలు తెరచుకోలేదు. తాజాగా యూజీసీ ఆదేశాలు విద్యార్థుల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, తదితర కోర్సుల ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పై మరోసారి గందరగోళం ఏర్పడింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా, తాజాగా యూజీసీ మాత్రం సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించాలని సూచించింది. దీంతో ఇప్పటివరకూ పరీక్షలు లేవని అనుకున్న స్టూడెంట్స్​లో గందరగోళం నెలకొంది.

వివిధ యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సులకు సంబంధించి ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు కరోనా ఎఫెక్ట్​తో వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను జూన్ 20 తర్వాత నిర్వహించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో ఫైనర్ ఇయర్ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహించాల్సిందేనంటూ యూజీసీ ఆదేశాలు ఇచ్చింది. కానీ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరగడంతో మరోసారి ఆ పరీక్షలను సర్కారు వాయిదా వేసింది. ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టకుండా గత సెమిస్టర్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే రిపోర్టును సీఎం కేసీఆర్​కు పంపించారు. ఇటు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేక, యూజీసీ ఆదేశాలను ఎలా అమలు చేయలన్న దానిపై విద్యా శాఖ తలలు పట్టుకుంటోంది. మరోవైపు యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. రెగ్యులర్ తో పాటు బ్యాక్ లాగ్, ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించేందుకు త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.

యూజీసీ కొత్త గైడ్​లైన్స్​తో స్టూడెంట్స్​లో టెన్ష న్ మొదలైంది. డిగ్రీలో 1.10 లక్షల మంది, బీటెక్ 50 వేలు, పీజీ, ఫార్మసీ, ఎంటెక్.. ఇతర కోర్సుల ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ మరో 90 వేల మంది దాకా ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ పరీక్షలు, ఎప్పుడు పెడ్తారనేది స్పష్టత లేదు. అసలు ఎలా నిర్వహిస్తారో క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్, ఎడ్ సెట్, ఐసెట్, పీఈసెట్, లాసెట్.. తదితర ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పైనా ప్రభావం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే, మరోవైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ పరీక్ష నిర్వహణ సాధ్యసాధ్యాలపై ఉన్నతాధికారులు కుస్తీ పడుతున్నారు

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?