క్లినికల్ ట్రయల్స్‌ కేసులో కొత్త ట్విస్ట్!

నీలోఫర్ హాస్పిటల్‌లో క్లినికల్ ట్రయల్స్ వ్యవహారం సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం నీలోఫర్ ఆసుపత్రిలో పర్యటించింది. ఎంత మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ చేశారన్న కోణంలో విచారణ జరిపింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని కమిటీ తెలిపింది. డాక్టర్ రాజారావ్, డాక్టర్ నిర్మల […]

క్లినికల్ ట్రయల్స్‌ కేసులో కొత్త ట్విస్ట్!
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 2:49 AM

నీలోఫర్ హాస్పిటల్‌లో క్లినికల్ ట్రయల్స్ వ్యవహారం సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం నీలోఫర్ ఆసుపత్రిలో పర్యటించింది. ఎంత మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ చేశారన్న కోణంలో విచారణ జరిపింది. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని కమిటీ తెలిపింది.

డాక్టర్ రాజారావ్, డాక్టర్ నిర్మల థామస్, డాక్టర్ లక్ష్మీ కామేశ్వరితోపాటు నిలోఫర్ హాస్పిటల్ సూపరిండెంట్ మురళీ కృష్ణ విచారణలో పాల్గొన్నారు. ఫిర్యాదు చేసిన డాక్టర్ లాలూ ప్రసాద్, ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి కుమార్ కూడా విచారణలో పాల్గొన్నారు. దాదాపు మూడు గంటల పాటు విచారణ కొనసాగింది.

ఎంత మంది మీద క్లినికల్ ట్రయల్స్‌ చేశారు..? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దిశగా విచారణ జరిపిన కమిటీ వివరాలు సేకరించింది. తాము సేకరించిన పూర్తి వివరాలు ప్రభుతానికి అందజేస్తామని కమిటీ స్పష్టం చేసింది. క్లినికిల్ ట్రయల్స్‌లో పాల్గొన్న ఫార్మా కంపెనీల వివరాలను కూడా ప్రభుత్వానికి అందజేస్తామని కమిటీ తెలిపింది.

అయితే డాక్టర్ రవికుమార్ నిబంధనలకు విరుద్ధంగా ట్రయల్స్ జరుపుతున్నారని డాక్టర్ లాలూ ప్రసాద్ ఆరోపించారు. ట్రయల్స్ విషయంలో పలు ఫార్మా కంపెనీలతో కుమ్మక్కయి హాస్పిటల్ ప్రొఫెసర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ డాక్టర్ లాలూ ఆరోపించారు. అయితే ఎథికల్ కమిటీ నిబంధనల మేరకు ట్రయల్స్ జరిగాయని కమిటీ ఓ నిర్ణయానికి వచ్చినా… పిల్లల తల్లిదండ్రుల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో