గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం… 21 మంది మృతి!

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో బోల్తా పడిన ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. 50 మంది గాయపడ్డారు. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు.. అంబాజీ ప్రాంతంలో లోయలో పడిపోయింది. ప్రమాదంలో గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అంబాజీ-దంతా రహదారిలోని త్రిశూలియ ఘాట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బనస్కాంతకు 160 కి.మీ. దూరంలో ప్రమాదం […]

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... 21 మంది మృతి!
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 1:54 AM

గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు లోయలో బోల్తా పడిన ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. 50 మంది గాయపడ్డారు. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు.. అంబాజీ ప్రాంతంలో లోయలో పడిపోయింది. ప్రమాదంలో గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అంబాజీ-దంతా రహదారిలోని త్రిశూలియ ఘాట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బనస్కాంతకు 160 కి.మీ. దూరంలో ప్రమాదం జరిగింది.

ఘటన సమయంలో బస్సులో మొత్తం 70మందికిపైగా ఉన్నారు. భారీ వర్షాల కారణంగానే బస్సు అదుపుతప్పినట్టు తెలుస్తోంది. బస్సు నుంచి 53 మందిని సురక్షితంగా బయటకు తీసినట్టు జిల్లా ఎస్పీ అజిత్ రజియన్ తెలిపారు. క్షతగాత్రులను దంటా పట్టణంలోని రెఫరల్ ఆసుపత్రి, పలాన్‌పూర్ సివిల్ ఆసుపత్రులకు తరలించినట్టు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో మరో 35 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు మరింతమంది వైద్యులను ఆసుపత్రులకు తరలించినట్టు పేర్కొన్నారు.

ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ మోదీ ట్వీట్ చేశారు. ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.