Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం… పెద్ద శేష వాహనంపై శ్రీవారు!

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ఇవాళ సాయంత్రం 5.23 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ సీతారామాచారి కంక‌ణ‌భ‌ట్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, […]

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం... పెద్ద శేష వాహనంపై శ్రీవారు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 30, 2019 | 11:44 PM

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ఇవాళ సాయంత్రం 5.23 నుండి 6 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ సీతారామాచారి కంక‌ణ‌భ‌ట్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.

ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి పెద్ద శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సీఎం జగన్‌ స్వామివారి వాహన సేవలో పాల్గొన్నారు. శేషవాహనం దాస్యభక్తికి నిదర్శనం. ఈ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, అందులోంచి దైవత్వం, తద్వారా పరమపదం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. వాహనసేవను భక్తులు కనువిందుగా దర్శించి పునీతులయ్యారు.