AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan Vizianagaram Tour : నేడు విజయనగరంలో జగన్‌ టూర్‌.. భారీ ఎత్తున పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ..

విజయనగరం జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యటన చేయనున్నారు. ఇందులో భాగంగా...

CM Jagan Vizianagaram Tour : నేడు విజయనగరంలో జగన్‌ టూర్‌.. భారీ ఎత్తున పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ..
Sanjay Kasula
|

Updated on: Dec 30, 2020 | 7:34 AM

Share

CM Jagan Vizianagaram Tour : విజయనగరం జిల్లాలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యటన చేయనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం 11:15 గంటలకు గుంకలాం చేరుకుంటారు.

పైలాన్‌ ఆవిష్కరణ, అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారు. విజయనగరం నియోజకవర్గంలోని విజయనగరం రూరల్‌ మండలం గుంకలాం వద్ద 397.36 ఎకరాల్లో 12,301 మంది లబ్ధిదారుల కోసం భారీ లే అవుట్‌ వేశారు. 4.37 కోట్లతో లే అవుట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసింది.

పేదలకు స్థలాలు ఇచ్చేందుకు గానూ 428 మంది రైతుల నుంచి 101.73 కోట్ల రూపాయలతో భూమిని కొనుగోలు చేసింది. విజయనగరం జిల్లా మొత్తం 1,08,230 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తోంది. దీనిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 65,026 మంది, పట్టణ ప్రాంతాలకు చెందిన 43,204 మంది లబ్ధిదారులు ఉన్నారు.

పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు మొత్తం 1,164 లే అవుట్‌లను సిద్ధం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వీటిని అభివృద్ధి చేసేందుకు రూ.10.19 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ