Appreciation: హుస్నాబాద్ ఎస్‌ఐ శ్రీధర్‌ను అభినందించిన తెలంగాణ గవర్నర్ తమిళ్ సై…
జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, కేంద్ర హోం శాఖ అవార్డుకు ఎంపికైన ఎస్‌ఐని తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ అభినందించారు.
జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి, కేంద్ర హోం శాఖ అవార్డుకు ఎంపికైన ఎస్‌ఐని తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ అభినందించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో జాతీయ స్థాయి అవార్డుకు తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పీఎస్ ఎస్‌ఐ శ్రీధర్ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై శ్రీధర్ ను అభినందిస్తూ ఉత్తరం పంపారు. దీనిపై స్పందించిన ఎస్ఐ శ్రీధర్ ఉన్నతాధికారులు, గవర్నర్ అభినందించడంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తానని అన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
కాగా ఎస్‌ఐ శ్రీధర్ స్టేషన్ పరిధిలో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టంను పకడ్బందీగా అమలు చేయడంతో ఈ అవార్డు వరించింది. ఇటీవలే కేంద్ర హోం శాఖ నేరస్తుల రికార్డులను నమోదు చేయాలని ఆయా రాష్ట్రాల పోలీసు శాఖలను ఆదేశించింది. నేరాల వివరాలు, కేసులు, వాటి పరిష్కారం ఇలా పూర్తి సమాచారాన్ని ఆధునీకరించాలని, అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. దీంతో ఈ విధులు అత్యుత్తమంగా నిర్వహించిన హుస్నాబాద్ ఎస్‌ఐని కేంద్ర హోం శాఖ అభినందించడంతో పాటు అవార్డుకు ఎంపిక చేసింది.