India Vs Australia 2020: ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ రికార్డు… ముత్తయ్య మురళీధరన్‌ను దాటేశాడు…

ఆస్ట్రేలియా భారత్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ద్వారా భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు ఉన్న శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ రికార్డును బద్దలుకొట్టాడు.

India Vs Australia 2020: ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ రికార్డు... ముత్తయ్య మురళీధరన్‌ను దాటేశాడు...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 30, 2020 | 5:38 AM

ఆస్ట్రేలియా భారత్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ద్వారా భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు ఉన్న శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ రికార్డును బద్దలుకొట్టాడు. టెస్టు మ్యాచుల్లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ల వికెట్లు తీసిన జాబితాలో మురళీధరన్ 191 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా…ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో అశ్విన్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. అశ్విన్ ఇప్పటి వరకు 192 మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ల వికెట్లు సాధించాడు. కాగా టెస్టుల్లో అశ్విన్ ఇప్పటి వరకు 375 వికెట్లు పడగొట్టాడు.

టాప్ 5 వీరే…

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ హాజిల్ వుడ్ ను అవుట్ చేసి 192 మంది లెఫ్ట్ హ్యాండర్స్‌ను అవుట్ చేసిన రికార్డు అశ్విన్ నమోదు చేశాడు. అంతకు ముందు శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్ 191 వికెట్లు పడగొట్టిన మొదటి స్థానంలో ఉండేవాడు. ప్రస్తుతం ఆయన రెండో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లాండ్ ఫేసర్ జేమ్స్ అండర్సన్ 186 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు గ్లెన్ మెక్ గ్రాత్ 172, షేన్ వార్న్ 172తో నాలుగో స్థానంలో సంయుక్తంగా ఉండగా.. ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే 167వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..