పోలీసులకు, సీఆర్‌పీఎఫ్ బలగాలకు మధ్య ఘర్షణ
మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ ఐటీదాడులు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. సీఎం కమల్‌నాథ్ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సీఎం కమల్‌నాథ్ మాజీ ఓఎస్‌డీ ప్రవీణ్‌కక్కడ్‌కు చెందిన కార్యాలయంలో సోదాల సందర్బంగా హైడ్రామా చోటు చేసుకుంది. సోదాల కోసం ఐటీ సిబ్బందికి భద్రతగా వచ్చిన సీఆర్‌పీఎఫ్ జవాన్లను మధ్యప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఓ దశలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు, మధ్యప్రదేశ్ పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తమను మధ్యప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారని సీఆర్‌పీఎఫ్ అధికారులు ఆరోపించారు. అయితే.. […]
మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ ఐటీదాడులు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. సీఎం కమల్‌నాథ్ సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సీఎం కమల్‌నాథ్ మాజీ ఓఎస్‌డీ ప్రవీణ్‌కక్కడ్‌కు చెందిన కార్యాలయంలో సోదాల సందర్బంగా హైడ్రామా చోటు చేసుకుంది. సోదాల కోసం ఐటీ సిబ్బందికి భద్రతగా వచ్చిన సీఆర్‌పీఎఫ్ జవాన్లను మధ్యప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఓ దశలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు, మధ్యప్రదేశ్ పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
తమను మధ్యప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారని సీఆర్‌పీఎఫ్ అధికారులు ఆరోపించారు. అయితే.. సోదాల పేరుతో కాంప్లెక్స్ గేట్లు మూసేయడంతో జనం ఇబ్బందులు పడుతున్నారని, గేట్లు తెరిపించేందుకు అక్కడికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. కాంప్లెక్స్‌లో ఒకరికి అత్యవసర వైద్య చికిత్స అవసరమని, గేట్లు తెరిపించాలని అడిగినందువల్లే.. తాము అక్కడికి వచ్చినట్టు తెలిపారు పోలీసులు. ఐటీ సోదాలను అడ్డుకోలేదని మధ్యప్రదేశ్ పోలీసులు వివరణ ఇచ్చారు.
భోపాల్, ఢిల్లీ, ఇండోర్, గోవాతో పాటు కమల్‌నాథ్ సన్నిహితులకు సంబంధించిన 50 చోట్ల ఐటీ శాఖ దాడులు చేసింది. 150మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి రప్పించారు. ఇండోర్‌లో ప్రవీణ్ కక్కడ్ నివాసం దగ్గర కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కీలకమైన పత్రాలను, 9 కోట్ల నగదును ఐటీశాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇండోర్‌లో ప్రవీణ్ కక్కడ్ నివాసంలో సోదాలు సందర్భంగా సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.