AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cipla on Moderna vaccine: మోడెర్నా బూస్టర్ వ్యాక్సిన్ కోసం సిప్లా గొంతెమ్మ కోరికలు.. కేంద్రం ఓకే చెప్పేనా..?

ఇదేక్రమంలో ఇప్పటివరకు నాలుగు భారత ఫార్మా దిగ్గజం సిప్లా కేంద్రానికి లేఖ రాసింది. మోడెర్నా బూస్టర్ వ్యాక్సిన్ గురించి కొన్ని వినతుల్ని కేంద్రం ముందు పెట్టింది.

Cipla on Moderna vaccine: మోడెర్నా బూస్టర్ వ్యాక్సిన్ కోసం సిప్లా గొంతెమ్మ కోరికలు.. కేంద్రం ఓకే చెప్పేనా..?
Moderna Vaccine
Balaraju Goud
|

Updated on: Jun 01, 2021 | 4:28 PM

Share

Cipla seeks union govt to Moderna vaccine: దేశంలో సెకండ్ వేవ్‌లో మార్చి నెల నుంచి విజృంభించిన కరోనావైరస్ మహమ్మారి మే నెల చివరి నుంచి తగ్గుముఖం పట్టింది. గత కొద్ది రోజుల నుంచి క్రమంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుకుంటూ వస్తున్నాయి. తాజాగా, దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది, మరణాల సంఖ్య కూడా తగ్గడం గమనార్హం. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. అయితే. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో వైరస్ తగ్గుముఖం పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదేక్రమంలో ఇప్పటివరకు నాలుగు భారత ఫార్మా దిగ్గజం సిప్లా కేంద్రానికి లేఖ రాసింది. మోడెర్నా బూస్టర్ వ్యాక్సిన్ గురించి కొన్ని వినతుల్ని కేంద్రం ముందు పెట్టింది. మొత్తం 4 అంశాల విషయంలో ప్రభుత్వం ఓకే అంటే… 5 కోట్ల మోడెర్నా బూస్టర్‌ వ్యాక్సిన్ల దిగుమతికి అనుమతించాలని కోరింది.

అమెరికా ఔషధ సంస్థ మోడర్నా తయారుచేసిన కోవిడ్‌ 19 సింగ్‌ల్‌ డోస్‌ బూస్టర్‌ను భారత్‌లోకి తీసుకువస్తామని, దానికి సత్వరం అనుమతులు ఇవ్వాలని సిప్లా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు ప్రధానంగా నాలుగు మినహాయింపులు కోరింది. వ్యాక్సిన్ ధర మేమే నిర్ణయిస్తాం. ప్రభుత్వ జోక్యం వద్దు.

  • దిగుమతిపై కస్టమ్స్‌ సుంకాన్ని మినహాయించాలి
  • ఈ వ్యాక్సిన్ వల్ల ఎవరికన్నా ఏదైనా జరిగితే మా కంపెనీకి సంబంధం లేదు.
  • బాధితులకు నష్టపరిహారం ఇవ్వం.
  • విదేశీ టీకాలకు భారత్‌లో ట్రయల్స్‌ నిర్వహించాలనే నిబంధన నుంచి వెసులుబాటు కల్పించాలి.

వీటన్నింటి నుంచి తమను మినహాయించాలని అభ్యర్థించింది. టీకా నిమిత్తం మోడర్నాకు ఒక బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.7,251 కోట్లు) చెల్లించేందుకు తాము సిద్ధపడినట్టు ప్రభుత్వానికి సిప్లా తెలిపింది. తమను ప్రోత్సహించడం ద్వారా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్రాన్ని సిప్లా అభ్యర్థించింది. ఈ మేరకు మే 29న కేంద్ర ప్రభుత్వానికి సిప్లా ప్రతిపాదన పంపినట్టు సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. భారతీయ మార్కెట్‌ కోసం సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని మోడర్నా సంస్థ యోచిస్తోంది. ఇందుకు సిప్లా, ఇతర భారతీయ ఔషధ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. 2022 నాటికి భారతీయ మార్కెట్లలో మొత్తం 5 కోట్ల మోడర్నా డోసులను అందుబాటులోకి తీసుకురావాలని సిప్లా యోచిస్తోంది.

Read Also… బాబా రాందేవ్ వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో బ్లాక్ డే పాటించిన డాక్టర్లు, అరెస్టుకై డిమాండ్