AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhuvaneshwar: కోవిడ్ బారిన భువీ కుటుంబ సభ్యులు… ఆందోళనకరంగా తల్లి ఆరోగ్యం..

Bhuvi Mothers Condition Critical: టీమిండియా బౌలర్​ భువనేశ్వర్​ కమార్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కోవిడ్ బారిన పడ్డారు. అతని తల్లి ఇంద్రేష్ దేవి పరిస్థితి విషమంగా ఉంది. ఆక్సిజన్​ స్థాయి పడిపోవడంతో...

Bhuvaneshwar: కోవిడ్ బారిన భువీ కుటుంబ సభ్యులు... ఆందోళనకరంగా తల్లి ఆరోగ్యం..
Bhuvaneshwar Kumar Mother C
Sanjay Kasula
|

Updated on: Jun 01, 2021 | 5:52 PM

Share

కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి ప్రముఖల వరకు ఇబ్బంది పడుతోంది. వారినే వారి కుటంబాలను కూడా ఇబ్బంది పెడుతోంది. తాజాగా టీమిండియా బౌలర్​ భువనేశ్వర్​ కమార్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కోవిడ్ బారిన పడ్డారు. అతని తల్లి ఇంద్రేష్ దేవి పరిస్థితి విషమంగా ఉంది. ఆక్సిజన్​ స్థాయి పడిపోవడంతో అతని తల్లి ఇంద్రేష్​ దేవిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఆమెను యూపీ మేరఠ్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

గర్భవతి అయినా భువీ భార్య నూపుర్​కు​ కూడా కరోనా పాజిటివ్​గా తేలింది. ఆమె ప్రస్తుతం మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో క్వారంటైన్​లో ఉన్నారు. గత నెల 20న భువీ తండ్రి కిరణ్​ పాల్ సింగ్​.. క్యాన్సర్​తో పోరాడుతూ మృతి చెందారు. అనంతరం ఆయన కర్మకాండలను బులంద్​ షహర్​లోని లుహార్లిలో చేశారు.

తర్వాతి రోజు భువీతో పాటు కుటుంబ సభ్యులందరూ కొవిడ్ టెస్ట్​ చేయించుకోగా.. వారందరికీ నెగెటివ్​గా తేలింది. నాలుగో రోజుల తర్వాత భువీ తల్లి ఇంద్రేష్​కు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో మరో సారి పరీక్షలు చేయించగా.. కరోనా నిర్ధరణ అయింది. దీంతో వీరంతా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఆయన తల్లికి ఆరోగ్యం క్షీణించి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఆక్సిజన్ స్థాయి పడిపోతుండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఆమె పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : LPG Cylinder Price: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన సిలిండర్‌ ధర

Bird Flu: చైనాలో మరో వైరస్.. బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన వ్యక్తి గుర్తింపు.. పెద్ద ప్రమాదకారి కాదన్న అధికారులు!