బాబా రాందేవ్ వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో బ్లాక్ డే పాటించిన డాక్టర్లు, అరెస్టుకై డిమాండ్
ఆలోపతిపైన, డాక్టర్లపైనా బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం దేశవ్యాప్తంగా డాక్టర్లు బ్లాక్ డే ని పాటించారు.నల్ల బ్యాడ్జీలు ధరించిన వీరు ఆయన బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆలోపతిపైన, డాక్టర్లపైనా బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం దేశవ్యాప్తంగా డాక్టర్లు బ్లాక్ డే ని పాటించారు.నల్ల బ్యాడ్జీలు ధరించిన వీరు ఆయన బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైద్యుల్లో కొందరు ఆయనను అరెస్టు చేయాలనీ రాసి ఉన్న పీపీఈ కిట్లు ధరించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ కు చెందిన ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ..గత నెల 29 నే జూన్ 1 న బ్లాక్ డే గా పాటించాలని పిలుపునిచ్చింది. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద రాందేవ్ బాబాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. బాబారాందేవ్ వ్యాఖ్యల కారణంగా ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల ఆసక్తి తగ్గిందని ఈ సంఘం పేర్కొంది. రోజూ ఆయన వ్యాక్సిన్ పట్ల, వ్యాక్సినేషన్ పాలసీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఈ సంఘం అధ్యక్షుడు డా. అమన్ దీప్ సింగ్ ఆరోపించారు. కానీ ఆయనపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఎందుకింత నిరాసక్తంగా ఉందన్నారు. ఇలా ఉండగా ..తానిదివరకే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని, అపాలజీ కూడా చెప్పానని రాందేవ్ బాబా ఓ న్యూస్ ఛానల్ వద్ద వ్యాఖ్యానించారు. కోవిద్ వారియర్లనందరినీ తాను గౌరవిస్తానని, వారిలో చాలామంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆయన అన్నారు. అయితే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చిన్న సమస్యను పెద్దది చేసిందన్నారు. ఆలోపతిని నేను శాస్త్రీయ సైన్స్ గా పరిగణిస్తానన్నారు.
యోగా, పౌష్టికాహారం వల్ల కోవిద్ నివారించవచ్చునని 90 శాతం మంది డాక్టర్లే సూచిస్తున్నారని ఆయన చెప్పారు. తాను డ్రగ్ మాఫియా గురించి ప్రస్తావించాను తప్పితే అలోపతి గురించి మాట్లాడలేదన్నారు.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : ఓనర్స్ పనితో షాక్‌తిన్న కుక్కపిల్ల…నవ్వులే నవ్వులే ..వైరల్ అవుతున్న వీడియో : Dog funny video viral.
యూపీలో అనాముషం..డెడ్ బాడీ నదిలో పడేస్తూ వీడియోకు పోజులు ఇచ్చిన యువకులు: vial video.