AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mega Message కరోనా నియంత్రణకు మెగా మెసేజ్

ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా నియంత్రణకు ప్రతీ ఒక్కరు నడుం కట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోందో.. అంతే వేగంగా వదంతులు, అపోహలు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సెలెబ్రిటీస్...

Mega Message కరోనా నియంత్రణకు మెగా మెసేజ్
Rajesh Sharma
|

Updated on: Mar 19, 2020 | 1:10 PM

Share

Megastar Chiranjeevi issued Corona message: ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా నియంత్రణకు ప్రతీ ఒక్కరు నడుం కట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోందో.. అంతే వేగంగా వదంతులు, అపోహలు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సెలెబ్రిటీస్… తమ తమ సందేశాలతో ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ వంటి వారు ఈ సందేశ వ్యాప్తిని ఇదివరకు ప్రారంభించగా… టాలీవుడ్‌లోను సందేశాల పరంపర మొదలైంది.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా నియంత్రణపై తెలుగు ప్రజలకు ఓ వీడియో సందేశంతో ముందుకొచ్చారు. ‘‘ కరోనా మరీ అతిగా భయపడేంత పెద్దదీ కాదు.. అలాగని నిర్లక్ష్యం చేసేంత చిన్నిది కాదు ’’ అంటూ ఓ వీడియో మీడియాకు విడుదల చేశారు చిరంజీవి. వీలైనంత వరకు ప్రజలంతా ఇంటి పట్టునే వుండేందుకు ప్రయత్నించాలని, సమూహాల్లోకి వెళ్ళ కుండా వుండడమే శ్రేయస్కరమని ఆయన తన సందేశంలో వివరించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వీడియో ప్రస్తావించిన చిరంజీవి.. కరోనా పూర్తిగా తొలగిపోయే వరకు ఈ జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు.