కరోనాపై కీలక పరిశోధన.. అంతలోనే శాస్త్రవేత్తని కాల్చి చంపేశారట..!
కోవిద్-19 వైరస్‌పై పరిశోధనలో కీలక దశలో ఉన్న చైనా శాస్త్రవేత్తను కాల్చిచంపడం కలకలం రేపుతోంది. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ బింగ్ లియూ (37)ని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాల్చిచంపినట్లు

Chinese Researcher: కోవిద్-19 వైరస్‌పై పరిశోధనలో కీలక దశలో ఉన్న చైనా శాస్త్రవేత్తను కాల్చిచంపడం కలకలం రేపుతోంది. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న డాక్టర్ బింగ్ లియూ (37)ని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాల్చిచంపినట్లు అనుమానిస్తున్నారు. లియూ.. రాస్ టౌన్‌షిప్‌లోని ఇంట్లోనే తూటా గాయాలతో విగజీవిగా కనిపించాడు.
మరోవైపు.. అతని ఇంటివద్ద కారులో హోగు(46) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతదేహం కనిపించింది. హోగు.. మొదట లియూను కాల్చి చంపి తర్వాత ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. లియూ పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయని, ఆయన కోవిద్ మానవ కణాలపై ఎలా పనిచేస్తుందన్న తీరును ఆయన విశ్లేషించారని అమెరికా పోలీసులు చెప్పారు. కోవిద్-19 పరిశోధనలే అతని హత్యకు దారి తీసి ఉంటాయని ఇప్పటికిప్పుడు చెప్పలేమని, లియూ ఇంట్లో ఎలాంటి దోపిడీ, ఘర్షణ జరిగిన ఆనవాళ్లు కనిపించడం లేదని తెలిపారు.
Also Read: తెలంగాణలో.. ‘మీ’ సేవలు షురూ